ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rameswaram: రామేశ్వరంలో 3 చోట్ల వెనక్కి వెళ్లిన సముద్రం

ABN, First Publish Date - 2023-09-28T08:25:58+05:30

రామనాధపురం జిల్లా రామేశ్వరం(Rameswaram)లో బుధవారం ఉదయం మూడు చోట్ల సముద్రం వెనక్కి మళ్లడంతో స్థానికులు, పర్యాటకులు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రామనాధపురం జిల్లా రామేశ్వరం(Rameswaram)లో బుధవారం ఉదయం మూడు చోట్ల సముద్రం వెనక్కి మళ్లడంతో స్థానికులు, పర్యాటకులు భయాందోళనలకు గురయ్యారు. రామనాథస్వామివారి ఆలయాన్ని దర్శించేందుకు వెళ్ళిన భక్తులు బుధవారం ఉదయం అక్కడి అగ్నితీర్థం సముద్రతీరానికి వెళ్ళినప్పుడు ఉన్నట్టుండి సముద్రం 300 మీటర్ల దూరానికి వెనక్కి మళ్ళింది. దీంతో తీరం పొడవునా భక్తులు విడిచిపెట్టిన వ్యర్థాలు, బండరాళ్లు బయల్పడ్డాయి. సుమారు అరగంట తర్వాత సముద్రం యథాతథ స్థితికి చేరింది. ఇదే విధంగా ఓలైక్కుడా, శంఖుమాల్‌ తీర ప్రాంతాల్లోనూ ఉన్నట్టుండి సముద్రం వెనక్కి మళ్లింది. దీంతో ఆ తీరంలో లంగరేసి ఉంచిన నాటుపడవలు, మరపడవలో ఇసుక మేటలలో కూరుకుపోయాయి. సుమారు పావుగంట తర్వాత ఈ రెండు ప్రాంతాల్లోనూ సముద్రం మామూలు స్థితికి చేరింది.

Updated Date - 2023-09-28T08:28:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising