ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

breed of stray dogs: వీధికుక్కలది ఏ జాతి? ఒకవేళ వాటికి తగిన శిక్షణ ఇస్తే ఏం జరుగుతుందో తెలుసా?

ABN, First Publish Date - 2023-03-21T06:44:45+05:30

breed of stray dogs: మన ఇళ్లలో ఉండే కుక్కల జాతి గురించి మనకు తెలుసు. కానీ వీధుల్లో తిరిగే వీధికుక్కల జాతి(breed of stray dogs) ఏమిటో తెలుసా? వికీపీడియా నివేదిక ప్రకారం మన దేశంలో రోడ్లపై తిరిగే వీధి కుక్కలు పరియా జాతికి చెందినవి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

breed of stray dogs: మన ఇళ్లలో ఉండే కుక్కల జాతి గురించి మనకు తెలుసు. కానీ వీధుల్లో తిరిగే వీధికుక్కల జాతి(breed of stray dogs) ఏమిటో తెలుసా? వికీపీడియా నివేదిక ప్రకారం మన దేశంలో రోడ్లపై తిరిగే వీధి కుక్కలు పరియా జాతికి చెందినవి. ఈ జాతి కూడా మనం మన ఇళ్లలో పెంచుకునే కుక్కల జాతి లాంటిదే. అయితే వాటి శారీరక రూపం, ఆలోచనా సామర్థ్యం(Thinking ability), రోగనిరోధక శక్తి పెంపుడు కుక్కల కంటే చాలా భిన్నంగా ఉంటుంది.

ఈ కుక్కల బరువు 15 నుండి 30 కిలోల వరకూ ఉంటుంది. ఈ తరహా కుక్కలు 11 నుండి 15 సంవత్సరాల వరకు జీవిస్తాయి(live). వాటి ఎత్తు 18 నుండి 25 అంగుళాలు. కొన్ని ప్రాంతాల్లో వీధికుక్కలను షేరు అని పిలుస్తారు, ఇవి భారతదేశం(India)లో 4500 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాయి.

మొహంజొదారో(Mohenjo Daro) తవ్వకాల్లో లభ్యమైన రాతి శిల్పాలలో(stone sculptures) కుక్కల ఆకారాలు ఉన్నాయని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. భారతదేశంలో ఉండటం వలన ఈ కుక్కలు ఇప్పుడు పూర్తిగా భారతీయ వాతావరణానికి అనుగుణంగా మారాయి. ఈ జాతి కుక్కకు సంబంధించిన విశేషమేమంటే వాటికి మెయింటెనెన్స్(Maintenance) అవసరం లేదు.

అంటే వాటిని సంరక్షించేందుకు ఎక్కువ సమయం వెచ్చించనవసరం లేదు. అలాగే అధికంగా డబ్బు(lot of money) ఖర్చు చేయవలసిన అవసరం లేదు. విధేయత విషయంలో ఈ కుక్కలు ఏ విదేశీ జాతి కుక్కల కంటే ఏ మాత్రం తక్కువ కాదు. వాటిని సరైన శిక్షణ(Training) ఇస్తే, ఇవి విదేశీ జాతి కుక్కల(Foreign Breed Dogs) కంటే సమర్థవంతమైనవిగా మారుతాయి.

Updated Date - 2023-03-21T10:37:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising