ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Restaurant: విదేశీ కస్టమర్లకు ఓ రెస్టారెంట్ వింత వార్నింగ్ కండీషన్.. ఫుడ్ టేస్ట్ చూసిన తర్వాత ఇలా చేస్తే..!

ABN, First Publish Date - 2023-11-24T12:29:30+05:30

తమ రెస్టారెంట్ లో ఫుడ్ టేస్ట్ చూసిన తరువాత ఈ పని అస్సలు చేయకండి అంటూ ఏకంగా నోటీసు బోర్డు కూడా పెట్టింది.

ఆహారం మీద కూడా ఇప్పట్లో ఫ్యాషన్ పుట్టుకొచ్చింది. కొత్త కొత్త ఆహారాలు రుచి చూడటానికి చాలా మంది కుతూహలం చూపిస్తారు. విదేశీలు భారత్ కు వచ్చినప్పుడు పానీ పూరీ, చాట్, సమోసా, బిర్యానీ, జజ్జీ వంటి స్పైసీ ఫుడ్స్ తిని వారి ఫీలింగ్ ను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. అయితే ఓ రెస్టారెంట్ విదేశీ కస్టమర్లకు వింత కండీషన్ తో కూడిన వార్నింగ్ ఇచ్చింది. తమ రెస్టారెంట్ లో ఫుడ్ టేస్ట్ చూసిన తరువాత ఈ పని అస్సలు చేయకండి అంటూ ఏకంగా నోటీసు బోర్డు కూడా పెట్టింది. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

తమ రెస్టారెంట్ కు వచ్చే కస్టమర్లకు ఓ భారతీయ రెస్టారెంట్(Indian Restaurant) వింత కండీషన్ పెట్టింది. బ్రిటన్(Britain) లో ఉన్న ఓ ఇండియన్ రెస్టారెంట్ ఈ వింత షరతును జారీచేసింది. భారతీయ ఆహారంలో సాధారణంగానే కారం(spicy) ఎక్కువగా ఉంటుంది. విదేశీయులు ఇంత కారం తినలేరు. చాలామంది ఈ కారాన్ని భరించలేక కన్నీళ్లు పెట్టుకోవం, ముక్కులలో నీళ్లు కార్చుకుంటూ తమకు ఏదైనా తీపి పదార్థం ఇవ్వమని అడగడం చేస్తుంటారు. బ్రిటన్ లోని భారతీయ రెస్టారెంట్ లో కారం స్థాయి 0-5 వరకు ఉంటుందని పేర్కొంది. ఎవరైనా రెస్టారెంట్ కు వచ్చి కారంగా ఉన్న ఆహారాన్ని ఆర్డర్ చేసి రుచి చూసిన తరువాత దాన్ని తినలేమంటూ చేతులెత్తేసినా, ఆహారం తినలేకపోతున్నాం కాబట్టి డబ్బు వాపస్ ఇవ్వమని డిమాండ్ చేసినా డబ్బు వెనక్కు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. పైపెచ్చు కారంతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వారికి తీపి పదార్థాలు కూడా అందించలేమని పేర్కొంది. కారంగా ఉన్న ఆహారాన్ని ఆర్డర్ చేసేముందు దాన్ని తినడానికి పూర్తీగా సంసిద్దమై ఉండాలని హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: రూ.1.50 లక్షల ఖరీదు లోపు.. టాప్ 10 బైకుల లిస్ట్ ఇదే..!


ఈ నోటీస్ బోర్డుకు సంబంధించిన ఫోటోను No Context Brits అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు చాలా మంది షాకవుతన్నారు. కొందరు పలురకాలుగా కామెంట్ చేస్తున్నారు. 'భారతీయులు ఆ రెస్టారెంట్ కు వెళ్లినప్పుడు ఆహారంలో కారం సరిపోకపోతే అప్పుడు డబ్బు వాపస్ ఇస్తారా?' అని ఒకరు లాజిక్ గా ప్రశ్నించారు. 'ఆ రెస్టారెంట్ వారు వార్నింగ్ బోర్డు పెట్టడం సరైనదే' అని మరొకరు సమర్థించారు. 'ఆర్డర్ తీసుకున్న ఆహారం తినలేకపోతే డబ్బు వాపస్ వచ్చిందని ఊహించుకుంటూ ఆ రెస్టారెంట్ నుండి బయటకు వచ్చెయ్యాలి అంతే' అని ఇంకొకరు కామెంట్ చేశారు.

ఇది కూడా చదవండి: నెల రోజుల పాటు చక్కెర వాడటం బంద్ చేస్తే.. జరిగేది ఇదే..!

Updated Date - 2023-11-24T12:29:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising