Viral News: ప్లీజ్ అంటూ వేడుకున్న కస్టమర్.. చెత్త డబ్బాలోంచి ఆ రెస్టారెంట్ ఓనర్ ఏం తీసి ఇచ్చారంటే..!
ABN, First Publish Date - 2023-10-20T09:43:41+05:30
అమెరికాలోని టెక్సాస్ (Texas) లో ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో ఇటీవల ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ రెస్టారెంట్‌కు భోజనం కోసం వెళ్లిన ఓ కస్టమర్.. రెస్టారెంట్ యజమానికి వింత విన్నపం చేశాడు.
Viral News: అమెరికాలోని టెక్సాస్ (Texas) లో ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో ఇటీవల ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ రెస్టారెంట్‌కు భోజనం కోసం వెళ్లిన ఓ కస్టమర్.. రెస్టారెంట్ యజమానికి వింత విన్నపం చేశాడు. ప్లీజ్ అంటూ వేడుకోవడంతో తప్పనిపరిస్థితుల్లో ఓనర్ చెత్త డబ్బాలోంచి కస్టమర్‌కు అతడు పారేసుకున్న ఒక వస్తువును తీసి ఇచ్చారు. ఇంతకీ ఆ వస్తువు ఏంటి? అసలు అది ఆ డస్ట్‌బిన్ (Dustbin) లోకి ఎలా వెళ్లింది? చెత్త కుండీలో పడిపోయిన ఆ వస్తువు అంత ఖరీదైనదా? తదితర వివరాలు తెలియాలంటే మనం ఈ స్టోరీ చదవాల్సిందే. యుఎస్‌లోని టెక్సాస్‌లో లాంగ్ జాన్ సిల్వర్స్ (Long John Silver) అనే రెస్టారెంట్‌కు కొన్ని వారాల క్రితం క్రెయిగ్ పాల్క్ (Craig Paulk) అనే వ్యక్తి భోజనానికి వెళ్లాడు. పాల్క్ ఆ రెస్టారెంట్‌కు రెగులర్ కస్టమర్ కూడా. ఈ క్రమంలో ఆ రోజు తన భోజనం పూర్తి చేసుకుని బయటకు వచ్చేశాడు. అలా బయటకు వచ్చిన కొద్దిసేపటి తర్వాత అతనికి ఏదో పొగొట్టుకున్న ఫీలింగ్ కలిగింది. అప్పుడే మనోడికి తాను ఏం పొగొట్టుకున్నాడో టక్కున గుర్తొచ్చింది. ఇంతకీ అతడు పొగొట్టుకుంది ఏంటంటే.. అతని కట్టుడు పళ్ళు.
Crime: పోలీసుల ముందు నిల్చున్న ఇతడు అమాయకంగా కనిపిస్తున్నాడు కానీ.. అతడి ఇంట్లో వెతికితే ఏం బయటపడ్డాయో తెలిస్తే..!
కొన్ని సంవత్సరాల క్రింతం క్రెయిగ్ నోటిలోని ముందు పళ్ళు పాడవడంతో కట్టుడు పళ్ళు అమర్చుకున్నాడు. భోజనం చేసే సమయంలో అతను ఎల్లప్పుడూ జాగ్రత్తగా రుమాలులో చుట్టి, టేబుల్‌పై ఉంచేవాడు. రెస్టారెంట్‌కు భోజనానికి వెళ్లిన ఆ రోజు కూడా ఇలాగే కట్టుడు పళ్ళు (Denture) రుమాలులో చుట్టి టేబుల్‌పై ఉంచాడు. కానీ, భోజనం పూర్తైన తర్వాత ఆ రూమాలును అక్కడే మరిచిపోయి బయటకు వచ్చేశాడు. కొద్దిసేపటి తర్వాత వెళ్లి చూస్తే ఆ రూమాలు టేబుల్‌పై కనిపించలేదు. ఆ రూమాలు అప్పటికే చెత్త కుండీలోకి చేరింది. దాంతో రెస్టారెంట్ మేనేజర్ స్టెల్లా మగానో (Stella Magano) కు తన గోడు విన్నవించాడు. కట్టుడు పళ్ళ రీప్లేస్‌మెంట్‌కు ఏకంగా 600 డాలర్లు వెచ్చించాల్సి ఉంటుందని, మీరే ఎలాగైనా సాయం చేయాలంటూ వేడుకున్నాడు. అతను పట్టుబట్టినప్పటికీ రెస్టారెంట్ మేనేజర్ మొదట తిరస్కరించింది.
Shocking: ఏడుస్తూ ఇంటికొచ్చిన 7 ఏళ్ల కూతురు.. ఏమైందమ్మా అని ఒడిలో కూర్చోబెట్టుకుని అడిగితే.. ఆ పాప చెప్పింది విన్న తల్లికి..!
కస్టమర్ స్వయంగా చెత్తను జల్లెడ పట్టడానికి నిరాకరించింది. అయితే, అతని అభ్యర్థనకు ఆ తర్వాత హృదయపూర్వక స్పందన వచ్చింది. స్వయంగా ఆమె చేతి తొడుగులు ధరించి చెత్త కుండీలో పడిపోయిన క్రెయిగ్ కట్టుడు పళ్ళను వెతికింది. చాలాసేపటి తర్వాత స్టెల్లా మగానోకు ఆ కట్టుడు పళ్ళు ఉన్న రూమాలు దొరికింది. ఆ పళ్ళు కూడా అందులోనే ఉన్నాయి. దాంతో వాటిని అతనికి వాటిని తిరిగి ఇచ్చింది. మేనేజర్ చేసిన సహాయానికి క్రెయిగ్ పాల్క్ ధన్యవాదాలు తెలియజేశాడు. ఈ వార్త కాస్తా బయటకు రావడంతో నెట్టింట వైరల్ అయింది.
Shocking: శ్రీకాంత్ సినిమా కథ.. అక్కడ నిజంగానే జరిగిందిగా.. పోలీసుల వల్లే ఓ వ్యక్తి చనిపోయినా.. శవాన్ని రోడ్డు పక్కన పడేసి..!
Updated Date - 2023-10-20T09:45:10+05:30 IST