RTC bus: రెండేళ్ల తర్వాత మళ్ళీ ప్రభుత్వ బస్సు.. హారతులిచ్చి స్వాగతించిన మహిళలు
ABN, First Publish Date - 2023-07-21T11:42:58+05:30
రెండేళ్ల అనంతరం గ్రామానికొచ్చిన బస్సుకు మహిళలు హారతులతో స్వాగతం పలికారు. కోయంబత్తూర్(Coimbatore) జిల్లా సూలూరు తాలూకా సుల్తాన్

పెరంబూర్(చెన్నై): రెండేళ్ల అనంతరం గ్రామానికొచ్చిన బస్సుకు మహిళలు హారతులతో స్వాగతం పలికారు. కోయంబత్తూర్(Coimbatore) జిల్లా సూలూరు తాలూకా సుల్తాన్‌పేట యూనియన్ వతంబచేరి, నల్లూరుపాళయం, పరిసర గ్రామాల్లో 1,500 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ ప్రాంతాల నుంచి వ్యాపారం, ఉద్యోగం, విద్య, వైద్యసేవలకు ప్రజలు తిరుప్పూర్, కోవై, పల్లడం, సూలూరు తదితర ప్రాంతాలకు వెళ్తుంటారు. సూలూరు(Sulur) నుంచి కరడివావి, కామనాయకంపాళయం, చిన్న వదంబచేరి గ్రామాల మీదుగా నల్లూరుపాళయం వరకు 35 ఏళ్లుగా నడుపుతున్న బస్సు , కరోనా కారణంగా రెండేళ్ల క్రితం నిలిపివేశారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ప్రజల విజ్ఞప్తి పరిశీలించిన రవాణా శాఖ, బుధవారం నుంచి బస్సు సర్వీసు పునరుద్ధరించింది. బుధవారం గ్రామానికి చేరుకున్న బస్సుకు మహిళలు హారతులతో స్వాగతం పలికి, డ్రైవర్, కండక్టర్‌కు మిఠాయిలు అందజేశారు.
Updated Date - 2023-07-21T11:42:58+05:30 IST