Sankarabharanam: అది.. పోయేవాడు పాడేదేనండీ..!
ABN, First Publish Date - 2023-02-03T20:03:54+05:30
శంకరాభరణం సినిమాలో చివరి పాట. సోమయాజులు చనిపోయే సీన్‌లో వచ్చే పాట అది. ఆ సీన్ గురించి వివరించి, వేటూరి సుందరరామ్మూర్తిని పాట రాయాల్సిందిగా కె.విశ్వనాథ్ చెప్పారు. సినిమాకు ప్రాణం లాంటి ఆ అద్భుత సీన్ అత్యద్భుతంగా వివరించడంతో..
శంకరాభరణం సినిమాలో చివరి పాట. సోమయాజులు చనిపోయే సీన్‌లో వచ్చే పాట అది. ఆ సీన్ గురించి వివరించి, వేటూరి సుందరరామ్మూర్తిని పాట రాయాల్సిందిగా కె.విశ్వనాథ్ చెప్పారు. సినిమాకు ప్రాణం లాంటి ఆ అద్భుత సీన్ అత్యద్భుతంగా వివరించడంతో.. వేటూరి అంతకంటే బ్రహ్మాండంగా పాటను రాశారు. దొరకునా ఇటువంటి సేవ అంటూ త్యాగరాజ కృతి మొదటి లైన్‌తో సాగే ఆ పాటలో రెండో లైను.. ‘నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము సేయు త్రోవ’.. అని వేటూరి రాశారు. అది చూసిన ఆత్రేయ.. ‘అంత పొడవున రాశారు. దాన్ని పాడేవాడు చచ్చిపోతాడు’ అని అంటే.. వేటూరి స్పందిస్తూ.. సినిమాలో ఈ పాట ‘పోయేవాడు పాడే పాటేనండి’ అని సందర్భోచితంగా బదులిచ్చారు. అనంతరం ఆ పాట పాడిన బాలు.. ‘మీరేమో పాడేవాడు పోతాడన్నారు. ఆయనేమో అది పోయేవాడు పాడే పాటేనన్నారు. చివరికి ఆ పాట పాడిన నాకు ప్రాణం పోయినంత పనైంది’ అని సరదాగా అన్నారు.
Updated Date - 2023-02-03T20:20:14+05:30 IST