ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

School Girls Video: స్కూలు నుంచి ఇంటికి వెళ్తున్న ఇద్దరు అమ్మాయిలు.. నడిరోడ్డుపై ఏం చేశారో చూస్తే..!

ABN, First Publish Date - 2023-08-25T16:28:26+05:30

సాటి వ్యక్తి కష్టం పట్ల జాలి, దయ చూపించడం అనేది ఖరీదైన పని కాదు. సాటి మనిషికి సహాయం చేస్తే డబ్బులేం ఖర్చయిపోవు. అయినా చాలా మంది ఇతరులకు కనీస సహాయం చేసేందుకు ముందుకు రారు. నిజానికి సాటి మనిషి పట్ల మానవత్వంతో వ్యవహరించే మనుషులున్న సమాజం ఎంతో ఉన్నతమైనది.

సాటి వ్యక్తి కష్టం పట్ల జాలి, దయ (Kindness) చూపించడం అనేది ఖరీదైన పని కాదు. సాటి మనిషికి సహాయం (Help) చేస్తే డబ్బులేం ఖర్చయిపోవు. అయినా చాలా మంది ఇతరులకు కనీస సహాయం చేసేందుకు ముందుకు రారు. నిజానికి సాటి మనిషి పట్ల మానవత్వంతో వ్యవహరించే మనుషులున్న సమాజం ఎంతో ఉన్నతమైనది. చిన్న వయసు నుంచే పిల్లలకు జాలి, దయ నేర్పించాలని చెబుతుంటారు. తాజాగా ఇద్దరు అమ్మాయిలు ఓ వ్యక్తికి చేసిన చిన్న సహాయం భారీగా ప్రశంసలు అందుకుంటోంది (School Girls Video).

మండుతున్న ఎండలో రిక్షా లాగుతున్న వ్యక్తికి ఇద్దరు బాలికలు సహకరించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. తెలియని వ్యక్తి పట్ల వారి సానుభూతి ఎంతో మంది హృదయాలను గెలుచుకుంటోంది. వైరల్ అవుతున్న ఆ వీడియో (Viral Video)లో ఇద్దరు బాలికలు పాఠశాల నుంచి ఇంటికి వెళుతున్నారు. విపరీతమైన ఆ ఎండలో ఓ రిక్షా కార్మికుడు అతి కష్టం మీద ట్రాలీని లాగుతున్నాడు. అప్పుడు ఆ ఇద్దరిలో ఒక బాలిక రిక్షాను వెనుక నుంచి తోసింది. మరో బాలిక ఆ వ్యక్తికి గొడుగు పట్టింది (School girls help man to pull trolley).

Short Marriage: వరుడు కావాలంటూ పేపర్లో యాడ్.. షార్ట్ మ్యారేజ్ అంటూ వింత కండీషన్‌తో అంతా షాక్..!

BemisalaP17076 అనే ట్విటర్ హ్యాండిల్‌లో పోస్ట్ అయిన ఈ వీడియో ఎంతో మంది హృదయాలను గెలుచుకుంటోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 5.5 లక్షల మంది వీక్షించారు. 20 వేల మందికి పైగా లైక్ చేశారు. ఆ ఇద్దరమ్మాయిలను ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ``పిల్లలను ఇలాగే పెంచాలి``, ``తెలియని వ్యక్తికి సహాయం చేయడం చాలా గొప్ప విషయం``, ``వారిద్దరూ ఎంతో మంది గౌరవాన్ని సంపాదించారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-08-25T16:28:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising