Viral: స్వర్గంలో అయిదేళ్లు ఉండి వచ్చా.. అక్కడంతా ఎలా ఉందంటే.. నివ్వెరపోయేలా చేస్తున్న ఓ మహిళ వీడియో..!
ABN, First Publish Date - 2023-07-13T18:41:48+05:30
చావు, పుట్టుకలు సహజం. అయితే బతికుండగా పాపాలు చేస్తే చనిపోయిన తర్వాత నరకానికి, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తారు అని ప్రజలు బలంగా నమ్ముతుంటారు. అయితే ఇదంతా పుక్కిట పురాణమని మరికొందరు కొట్టేస్తుంటారు. స్వర్గం, నరకం నిజంగా ఉన్నాయా.. అనే విషయం మాత్రం..
చావు, పుట్టుకలు సహజం. అయితే బతికుండగా పాపాలు చేస్తే చనిపోయిన తర్వాత నరకానికి, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తారు అని ప్రజలు బలంగా నమ్ముతుంటారు. అయితే ఇదంతా పుక్కిట పురాణమని మరికొందరు కొట్టేస్తుంటారు. స్వర్గం, నరకం నిజంగా ఉన్నాయా.. అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. నిజంగా ఉంటే మాత్రం అంతా స్వర్గానికే వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే.. ఓ మహిళ తాను స్వర్గంలో ఐదేళ్లు ఉండి వచ్చానని చెప్పడం విని అంతా నివ్వెరపోతున్నారు. ఈ మహిళ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
లిండా క్రామెర్ అనే మహిళ (woman) వైద్య వృత్తికి సంబంధించిన శిక్షణ పూర్తి చేసుకుని సేవలు అందిస్తోంది. అయితే ప్రస్తుతం ఈమె సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2001 మే 6న లిండా తన ఇంట్లో టాయిలెట్‌కి వెళ్తుండగా.. ఉన్నట్టుండి కిందపడి అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు మరణించిందని ధ్రువీకరించారు. అయితే ఆమెను బతికించేందుకు సీపీఆర్ చేశారు. సుమారు 14 నిముషాల పాటు ఆమె అచేతన స్థితికి వెళ్లినట్లు వైద్యులు గుర్తించారు. అయితే అనూహ్యంగా తర్వాత స్పృహలోకి వచ్చిన ఆమె.. సంచలన విషయాలను తెలియజేసింది. తన శరీరం ఉన్నట్టుండి గాలిలోకి తేలిందని, నేరుగా స్వర్గానికి వెళ్లానని చెప్పింది.
అక్కడ ఎవరెస్ట్ (Everest) కంటే 30,000 రెట్లు పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయట. అలాగే దారికి రెండు వైపులా మొత్తం పూల మొక్కలతో (Flowering plants) నిండి ఉందట. అదేవిధంగా చుట్టూ అందమైన సరస్సులు (Beautiful lakes) ఉన్నాయని కూడా చెప్పింది. అక్కడున్న భవనాలతో పోల్చితే దుబాయ్‌లో (Dubai buildings) ఉన్న భవనాలు చిన్న చిన్న గుడిసెలతో సమానమట. స్వర్గానికి (heaven) వెళ్లిన తాను.. అక్కడున్న వారితో కూడా మాట్లాడానని చెప్పింది. అలాగే తాను ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలోకి మారే అవకాశం కూడా ఉందని తెలిపింది.
Viral Video: ఎక్కడి నుంచి వస్తాయి తల్లీ ఇలాంటి ఐడియాలు.. టూత్ పేస్ట్ డబ్బాను ఇలా కూడా వాడొచ్చా..!?
సుమారు ఐదేళ్ల పాటు అక్కడే గడిపానని చెబుతోంది. ఇటీవల ఓ య్యూటూబ్ చానల్‌కు (YouTube channel) ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను వెల్లడించింది. అయితే ఈమె మాటలను పరిశోధకులు కొట్టిపారేస్తున్నారు. ఓ భ్రమలో ఉండడం వల్ల ఇలా అనిపిస్తుందని తెలిపారు. వైద్య వృత్తిలో ఉన్న లిండా క్రామెర్.. స్వర్గం ఉందంటూ, అక్కడ తాను ఐదేళ్ల పాటు గడిపానంటూ చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
Updated Date - 2023-07-13T18:49:06+05:30 IST