ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Naga Chaitanya: పాట ఒకటి... సెట్లు ఏడు!

ABN, First Publish Date - 2023-02-16T17:47:33+05:30

అక్కినేని నాగ చైతన్య (Akkineni naga chaitanya), వెంకట్‌ ప్రభు (Venkata prabhu) కాంబినేషన్‌లో తెలుగు-తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘కస్టడీ’ (Custody) ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కినేని నాగ చైతన్య (Akkineni naga chaitanya), వెంకట్‌ ప్రభు (Venkata prabhu) కాంబినేషన్‌లో తెలుగు-తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘కస్టడీ’ (Custody) ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. చైతూ, కృతి శెట్టిపై (Krithi shetty)ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాట చిత్రీకరణ కోసం ప్రొడక్షన్‌ డిజైనర్‌ రాజీవన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ డి.వై సత్యనారాయణ కలిసి అద్భుతమైన ఏడు ప్రత్యేక సెట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న పాటకు శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ డ్యాన్స్‌ నంబర్‌ బిగ్‌ స్ర్కీన్‌పై విజువల్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్‌ చెబుతోంది. మాస్ర్టో ఇళయరాజా, యువన్‌ శంకర్‌ రాజా కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన హీరోహీరోయిన్ల గ్లింప్స్‌కు చక్కని స్పందన వచ్చిన సంగతి తెలిసింది. నాగ చైతన్య కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో కస్టడీ ఒకటిగా నిలుస్తుందని, మే 12న సినిమాను విడుదల చేస్తామని నిర్మాత శ్రీనివాస చిట్టూరి అన్నారు.

అరవింద్‌ స్వామి, ప్రియమణి, శరత్‌ కుమార్‌, ప్రేమ్‌జీ అమరెన్‌, సంపత్‌ రాజ్‌, వెన్నెల కిషోర్‌, ప్రేమి విశ్వనాథ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: పవన్‌కుమార్‌, మాటలు: అబ్బూరి రవి, సినిమాటోగ్రాఫర్‌: ఎస్‌ఆర్‌ కతీర్‌, సంగీతం: మాస్ర్టో ఇళయరాజా, యువన్‌ శంకర్‌ రాజా.

Updated Date - 2023-02-16T17:47:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising