ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shivakashi matchbox: శివకాశి అగ్గిపెట్టెకు వందేళ్లు

ABN, First Publish Date - 2023-07-05T11:07:15+05:30

విరుదునగర్‌ జిల్లా శివకాశి(Shivakashi ) ప్రాంతంలో అగ్గిపెట్టెల పరిశ్రమలు ప్రారంభమై వందేళ్లు పూర్తయ్యాయి. ఈ వేడుకలను కోలాహలంగా జరుపుకోవాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారీస్‌(చెన్నై): విరుదునగర్‌ జిల్లా శివకాశి(Shivakashi ) ప్రాంతంలో అగ్గిపెట్టెల పరిశ్రమలు ప్రారంభమై వందేళ్లు పూర్తయ్యాయి. ఈ వేడుకలను కోలాహలంగా జరుపుకోవాలని అగ్గిపెట్టెల పరిశ్రమల యజమానులు, కార్మికులు భారీ ఏర్పాట్లు చేపట్టారు. 1680వ సంవత్సరంలో భాస్వరం, గంధకం, ముడి పదార్థాలతో మొట్టమొదటిగా అగ్గిపుల్లలు తయారు చేశారు. 1805వ సంవత్సరం ఫ్రాన్స్‌ రాజధాని ప్యారీస్‏లో ఆధునిక విధానంలో అగ్గిపెట్టెలు తయారయ్యాయి. 1899వ సంవత్సరం బ్రిటీష్‌ సంస్థలు అగ్గిపుల్లలు, వాటిని భద్రపరిచేందుకు పెట్టెలు తయారు చేసినట్లు చరిత్ర చెబుతోంది. కాగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా కోల్‌కతాలో అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తిరుచ్చి కళాశాలలో చదువుకుంటున్న శివకాశికి చెందిన చిన్ననాడార్‌, ఆ కళాశాల గ్రంథాలయంలో అగ్గిపెట్టె(Matchbox)ల తయారీకి సంబంధించిన పుస్తకాన్ని శ్రద్ధగా చదివారు. దాని ద్వారా తన సొంత ప్రాంతమైన శివకాశిలో అగ్గిపెట్టెల పరిశ్రమను ప్రారంభించాలని భావించారు. ఈ మేరకు తన బంధువులు షణ్ముగ నాడార్‌, అయ్యా నాడార్‌ను కోల్‌కతాకు పిలిపించుకుని అగ్గిపెట్టెల తయారీ, అందుకు వినియోగిస్తున్న ముడి పదార్థాలు వంటివాటిపై 8 నెలల పాటు అధ్యయనం చేశారు.

శివకాశిలో..

1923వ సంవత్సరం జూలైలో షణ్ముగ నాడార్‌, అయ్యా నాడార్‌ సంయుక్తంగా అగ్గిపెట్టెల పరిశ్రమను స్థాపించారు. ఇందుకోసం వారు జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న యంత్రాల ద్వారా అగ్గిపుల్లలు, పెట్టెలు డిజైన్‌ చేశారు. ఆ సమయంలో భారత స్వాతంత్య్రయోద్యమంలో ముందుండి నడిపిన మహాత్మాగాంధీ.. స్వదేశీ వస్తువులనే వినియోగించాలని ప్రచారం చేశారు. దీంతో శివకాశిలో అగ్గిపుల్లల తయారీ, పెట్టెల తయారీ, ముడిపదార్థాల వినియోగం, మనుషుల వినియోగం వంటి వాటిపై పరిశీలన జరిపారు. ఆ అగ్గిపుల్లల్ని ఇంటింటా ఎలా తయారు చేయాలన్న దానిపై అవగాహన కల్పించారు. ఆ విధంగా అక్కడ అగ్గిపుల్లల తయారీ ఊపిరి పోసుకోగా, ఆ తరువాత బాణసంచా తయారీ కూడా ప్రారంభమైన విశ్వవ్యాప్తమైన విషయం తెలిసిందే. అగ్గిపెట్టెల పరిశ్రమ లాభసాటిగా ఉండడంతో రాష్ట్రంలో గుడియాత్తం, కలుగుమలై, కోవిల్‌పట్టి, సాత్తూర్‌, శంకరన్‌కోయిల్‌ తదితర ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు వెలిశాయి. లక్షలాదిమంది కార్మికులకు జీవనోపాధి కల్పిస్తున్నాయి. ఇదిలా వుండగా వందేళ్ల పండుగను సంబరంగా జరుపుకోవాలని అగ్గిపెట్టెల తయారీదారుల సంఘం అధ్యక్షుడు విజయానందం పిలుపునిచ్చారు.

Updated Date - 2023-07-05T11:07:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising