కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shocking: భగవంతుడా.. ఇంతకంటే దారుణం ఉంటుందా..? తల్లి శవం కంపు కొడుతున్నా అదే ఇంట్లో వారం రోజులుగా కూతురు..!

ABN, First Publish Date - 2023-10-05T14:25:15+05:30

సోషల్ మీడియా కారణంగా వివిధ ప్రాంతాలలో వెలుగులోకి వచ్చే కొన్ని సంఘటనలు ఉలిక్కిపడేలా చేస్తుంటాయి. ఇప్పుడూ అలాంటి సంఘటన అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. కన్నతల్లి మరణంచి ఆ మృతదేహం కంపు కొడుతున్నా అదే ఇంట్లో వారం రోజులపాటు ఉందొక కూతురు.

Shocking: భగవంతుడా.. ఇంతకంటే దారుణం ఉంటుందా..? తల్లి శవం కంపు కొడుతున్నా అదే ఇంట్లో వారం రోజులుగా కూతురు..!

మరణం ఎప్పుడు ఎలా ముంచుకొస్తుందో ఎవరికీ తెలియదు అంటారు. మరణం సంగతి సరే.. మరణం తరువాత మృతదేహం విషయంలో కూడా దారుణాలు జరుగుతుంటాయి. సోషల్ మీడియా కారణంగా వివిధ ప్రాంతాలలో వెలుగులోకి వచ్చే కొన్ని సంఘటనలు ఉలిక్కిపడేలా చేస్తుంటాయి. ఇప్పుడూ అలాంటి సంఘటన అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. కన్నతల్లి మరణంచి ఆ మృతదేహం కంపు కొడుతున్నా అదే ఇంట్లో వారం రోజులపాటు ఉందొక కూతురు. ఈ షాకింగ్ సంఘటన గురించి పూర్తీగా తెలుసుకుంటే..

అస్సాం(Assam) రాష్ట్రం జోర్హాట్ జిల్లాలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. అనుపమ దత్తా అనే 75ఏళ్ళ వృద్దురాలికి(75 years old women) ముగ్గురు పిల్లలు. ఇద్దరు కొడుకులు ఉద్యోగాలు చూసుకున్నారు. ఒకరు అమెరికాలో ఉంటుండగా, మరొక కొడుకు గ్యాంగ్ టక్ లో నివసిస్తున్నాడు. ఇక ఈమెకున్న ఒక్కగానొక్క కూతురుకు మానసిక ఎదుగుదల(mental development) సరిగా లేదు. ఆమె కన్నతల్లితో కూడా ఎక్కువ మాట్లాడదు, ఎప్పుడూ ఒంటరిగా ఉంటుంది. బయటకు అసలు వెళ్లదు. ఈ కారణంతో ఆమెకు పెళ్లి కూడా కాలేదు. కొడుకులిద్దరూ దూరం ఉండటంతో అనుపమ తన కూతురితో కలసి నివసిస్తోంది. ఈ క్రమంలో గ్యాంగ్ టక్ లో నివసించే అనుపమ కొడుకు తన తల్లికి ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా తల్లి నుండి ఎలాంటి స్పందనా లేదు. రెండుమూడు రోజులు ఎదురుచూసి చివరికి అతను ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వచ్చి ఎంతసేపు తలుపులు బాదినా తలుపు తియ్యకపోవడంతో ఇరుగుపొరుగు వారికి సమస్య చెప్పాడు. పోలీసులకు సమాచారం అందించడం మంచిదని ఇరుగుపొరుగు వారు సలహా ఇవ్వడంతో పోలీసులకు ఫోన్ చేశాడు.

Viral Video: ఈ రిపోర్టర్ చెప్పే న్యూస్.. ఆ చిలుకకు కూడా నచ్చలేదేమో.. సైలెంట్‌గా వచ్చి ఇయర్ బడ్స్‌ను ఎత్తుకెళ్లిపోయిందిగా..!



ఇంటి దగ్గరకు చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లగా విపరీతమైన దుర్వాసన వచ్చింది. ఆ వాసనను అనుసరించి గదిలోకి వెళ్ళగా పడక మీద కుళ్ళిపోయిన స్థితిలో అనుపమ మృతదేహం లభించింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జేఎంసీహెచ్ కు తరలించారు. ఇక్కడ విస్తుపోయే విషయం ఏమిటంటే మృతదేహం దుర్వాసన వస్తున్నా అనుపమ కూతురు కూడా అదే ఇంట్లో ఉంది. ఆమె మొదటినుండే ఎవరితో మాట్లాడేది కాదని తెలిసి అనుపమ మరణానికి ఆమె కారణం కాకపోవచ్చని అంటున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తరువాత దానికి తగ్గట్టు చర్యలు తీసుకుంటామన్నారు.

Neeraj Chopra: జాతీయ జెండాను విసిరిన ప్రేక్షకుడు.. కింద పడిపోతుందేమోనని నీరజ్ చోప్రా చేసిన ఫీట్‌కు నెటిజన్లు ఫిదా..!


Updated Date - 2023-10-05T14:25:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising