ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేరళ కోర్టులో షాకింగ్ పరిణామం.. పోలీసులు పట్టుకున్న గంజాయిని ఎలుకలు తినేశాయ్.. కేసులో తీర్పునిచ్చేదెలా..?

ABN, First Publish Date - 2023-02-19T15:29:58+05:30

వినడానికి విచిత్రంగా అనిపించినా జరిగింది మాత్రం అదే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేసుకు కీలకమైన సాక్ష్యం కాస్తా ఎలుకల పాలయ్యింది. వినడానికి విచిత్రంగా అనిపించినా జరిగింది మాత్రం అదే.. తప్పు చేసిన వాడికి ఇక శిక్ష పడటం ఖాయం అనుకున్న దశలో జరిగిన ఈ సంఘటనకు కోర్టు కూడా షాకయ్యింది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే..

కేరళ తిరువనంతపురంలో గంజాయి ఉందనే కారణంతో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన 2016, డిసెంబర్ నెలలో జరిగింది. సదరు వ్యక్తి దగ్గర సుమారు 125గ్రాముల గంజాయి పట్టుబడింది. పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకుని కోర్టువారి ముందు ఉంచారు. కోర్టు వారు ఆ గంజాయిలో 100గ్రాములను పరిశోధనల నిమిత్తం ల్యాబ్ కు పంపారు. మిగిలిన 25గ్రాములను సాక్ష్యంగా కోర్టు లోనే ఒక గదిలో భద్రపరిచారు. గంజాయి గురించి కేసు విచారణ మొదలయ్యే సమయానికి అక్కడ పరిస్థితులు మొత్తం తారుమారు అయిపోయాయి. పరీక్ష కోసం పంపిన గంజాయి ల్యాబ్ లో అయిపోయింది. దానికి సాక్ష్యంగా కోర్టులో గదిలో ఉన్న గంజాయిని తీసుకురమ్మారు జడ్జ్. అయితే ఆ గదిలో ఉన్న గంజాయిలో సగభాగం మాయమైపోయింది. ఎలా మాయమయ్యిందని నిలదీయగా ఎలుకలు తినేశాయని సమాధానం ఇచ్చారు అక్కడి సిబ్బంది.

Read also: నా భర్త నపుంసకుడు.. చికిత్స కూడా చేయించుకోవడం లేదంటూ కేసు పెట్టిందో భార్య.. ఎన్నేళ్ల క్రితం పెళ్లయిందంటే..


శిక్ష పడటం ఇక ఖాయం అనుకున్న అందరూ గంజాయి మాయమవడంతో అవాక్కయ్యారు. దీని వల్ల కేసు బలహీనం అవుతుందని, నిందితుడు శిక్ష తప్పించుకునే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా నిందితులు శిక్ష తప్పించుకోవడానికి మంచి పథకమే వేసినట్టున్నారు అంటున్నారు ఈ కేసు గురించి విన్నవాళ్ళు.

Updated Date - 2023-02-19T15:30:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising