Shocking Video: షాకింగ్.. ఆకాశంలోంచి మిరుమిట్లు గొలిపేలా ఆ వింత వెలుగేంటి..? వీడియో తీస్తూనే జూమ్ చేసి మరీ చూస్తే..
ABN, First Publish Date - 2023-04-06T15:41:01+05:30
కంటికి సరిగ్గా చిక్కని ఆ వెలుగేంటో చూద్దామని కెమెరా కన్ను ఎక్కుపెట్టి మరీ చూశారు. అంతే ఒక్కసారిగా
ఈ ప్రపంచం చాలా వింతైనది. అయితే శాస్త్రవేత్తలు(Scientists) ఎప్పటికప్పుడు గ్రహాంతర వాసుల(Aliens) గురించి శోధిస్తూనే ఉన్నారు. ఆకాశంలో ఏదైనా తళుక్కున మెరిసినా.. మనిషి ఆకారం కనిపించినా ఇక గ్రహాంతర వాసులంటూ చాలా చర్చ జరిగిపోతుంది. కొందరు దారిలో నడుచుకుంటూ వెళుతుండగా ఆకాశంలో వింత వెలుగు(Strange light) కనిపించింది. కంటికి సరిగ్గా చిక్కని ఆ వెలుగేంటో చూద్దామని కెమెరా కన్ను ఎక్కుపెట్టి మరీ చూశారు. అంతే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆకాశంలో వింత వెలుగుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే..
ప్రపంచంలో మనిషిని ఆశ్చర్యపరిచే విషయాలు చాలా ఉన్నాయి. వాటిలో అంతరిక్షం(Space), గ్రహాంతరవాసులు(Aliens) ఎప్పుడూ హాట్ టాపిక్కే.. కొందరు దారిలో నడుచుకుంటూ వెళుతుండగా ఆకాశంలో వింత వెలుగు కనిపించింది. అందరూ దానివైపే దృష్టి సారించారు. చాలామంది తమ మొబైల్ ఫోన్ తీసి వీడియోలు తీశారు. ఆ వెలుగేంటో అని జూమ్ చేసి చూడగా అది నీలి ఆకాశంలో కిటికీ తలుపులు తెరిచినట్టు కనిపిస్తోంది(Like sky windows open). లోపలి నుండి బయటకు వెలుగు ప్రసరించడం స్పష్టంగా కనిపించింది. కొందరు దీన్ని అంతరిక్ష నౌక (Space ship)అని అన్నారు. కానీ అంతరిక్ష నౌకలు ఎప్పుడూ కంటికి కనిపించవు.. అలాంటిది అదెలా కనబడుతుందని ఇతరులు ఖండించారు. మరికొందరు అది ఇంకా రూపాంతరం చెందుతున్న మేఘం(Transforming cloud) అందుకే అలా కనబడుతోంది అని ఏదో లాజిక్ చెప్పారు కానీ అది కూడా అంత సరిపోలేదు. ఇంకొందరు అది విమానంలాగుంది(aeroplane), లైట్ల వెలుగులో అది అలా కనిపిస్తోంది అని అన్నారు. ఇలా ఎవరికి తోచింది వారు అన్నారు.
వావ్ టెర్రిఫైయింగ్(Wow Terrifying) అనే ట్విట్టర్ అకౌంట్ నుండి ఈ వీడియోను షేర్ చేశారు. ఇది ఎక్కడ జరిగిందో తెలీదు.. లొకేషన్ ఏంటనేది మెన్షన్ చేయలేదు కానీ.. ఇది చూసి హాలీవుడ్ సినిమాలను గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్లు. అది ఖచ్చితంగా UFO(Unidentified flying object) అని బలంగా వాదిస్తున్నవారు అధికంగా ఉన్నారు. గ్రహాంతర వాసులు, అంతరిక్ష నౌకలను సినిమాల్లో మాత్రమే చూస్తూంటాం.. కానీ ఇలా ఆకాశంలో ఏదైనా కనబడితే మాత్రం ఏ విషయం చెప్పలేం. మొత్తానికి ఆకాశంలో రహస్యాలు మనుషుల ఊహకు కూడా అందనంత కష్టతరమైనవి..
Updated Date - 2023-04-06T15:41:01+05:30 IST