Shocking Video: ఓరి దేవుడో.. ఇదేం చట్నీ..? బొగ్గులతో మంటను చేసి వెరైటీ రెసిపీ.. తిన్న వాళ్లందరికీ రోగాలు రావడం ఖాయం..!
ABN, First Publish Date - 2023-10-07T18:52:31+05:30
ఇడ్లీ, దోశ, ఉప్మా మొదలైన అల్పాహారాలకు అమితమైన రుచిని అందించేది చట్నీ. చట్నీ లేకుండా ఆయా పదార్థాలను తినడం కష్టం. ఈ వంటకాలకు మాత్రమే కాదు.. రకరకాల ఆహార పదార్థాలకు చట్నీయే అసలైన రుచిని ఇస్తుంది. వివిధ రకాల ఆహార పదార్థాల్లోకి ఎన్నో రకాల చట్నీలు అందుబాటులో ఉన్నాయి.
ఇడ్లీ, దోశ, ఉప్మా మొదలైన అల్పాహారాలకు (Tiffins) అమితమైన రుచిని అందించేది చట్నీ (Chutney). చట్నీ లేకుండా ఆయా పదార్థాలను తినడం కష్టం. ఈ వంటకాలకు మాత్రమే కాదు.. రకరకాల ఆహార పదార్థాలకు చట్నీయే అసలైన రుచిని ఇస్తుంది. వివిధ రకాల ఆహార పదార్థాల్లోకి ఎన్నో రకాల చట్నీలు అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఓ చట్నీ వీడియో (Chutney Video) చూస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఆ చట్నీలో కాలుతున్న బొగ్గులను వేశారు (Chutney with Coal). ఈ వీడియో చూసిన జనాలు షాకవుతున్నారు.
thatdelhifoodie అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ దుకాణదారుడు ఆ వెరైటీ చట్నీ చేయడం కనిపిస్తోంది. ముందుగా బొగ్గులను కాల్చి వాటిని చట్నీ ఉన్న గిన్నెలో వేసి మూత పెట్టేశాడు. కొద్ది సేపటికి ఆ పాత్ర నుంచి భారీగా పొగ బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆ బొగ్గులను చట్నీలో బాగా కలిపి అందరికీ వేస్తున్నాడు. ఈ వీడియో చూసిన జనాలు నివ్వెరపోతున్నారు. చట్నీలను ఇలా కూడా తయారు చేస్తారా? అని ఆశ్చర్యపోతున్నారు.
Python Video: ఈ కొండచిలువకు వాహనాలంటే యమా ఇష్టమనుకుంటా.. లారీలోంచి బయటకు తీస్తే ఏకంగా బైక్ను చుట్టేసింది.. చివరకు..!
ఆ వైరల్ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది చాలా దారుణం.. ఆ చట్నీ తిన్న వారికి కేన్సర్ రావడం ఖాయం``, ``ఇలాంటి చట్నీని నిజంగా ఎవరైనా తింటారా``, ``అది విష ప్రయోగం``, ``అది కేవలం వీడియో కోసమే అయ్యుంటుంది``, ``ఫుడ్ బ్లాగర్లను చూసి అందరూ అలాంటి ప్రాణాంతక ప్రయోగాలు చేస్తున్నారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
Updated Date - 2023-10-07T18:52:31+05:30 IST