ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Heart Health: మీరు ఈ లక్షణాలను గమనించారా? అయితే మీ గుండె ఆరోగ్యంగా ఉన్నట్టే..

ABN, First Publish Date - 2023-03-10T17:02:19+05:30

మీ శరీర లక్షణాలను బట్టి మీ గుండె ఆరోగ్యంగా ఉందా? లేదా? అనేది తెలుసుకొవచ్చట. కింద పేర్కొన్న లక్షణాలు మీరు గమనించినట్టైతే మీరు మీ గుండె గురించి పెద్దగా ఆందోళన చెందనక్కర్లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రస్తుతం గుండె సంబంధిత మరణాలు (Heart Attacks) ఆందోళన రేకెత్తిస్తున్నాయి. గుండె పోటు అనేది మధ్య వయసు వారిని, వృద్ధులనే కబళిస్తుందని ఇన్నాళ్లూ అనుకుంటూ వచ్చాం. అయితే ఇటీవలి కాలంలో చిన్న పిల్లలు, యుక్త వయసు వారే ఎక్కువగా హార్ట ఎటాక్‌కు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అందరిలోనూ గుండె ఆరోగ్యం గురించి ఆందోళన మొదలైంది. నిజానికి ఆందోళనే హార్ట్ ఎటాక్‌కు ముఖ్య కారణం అనే సంగతి తెలిసిందే. కాగా, మీ శరీరంలో కనిపించే కొన్ని లక్షణాలను బట్టి మీ గుండె ఆరోగ్యంగా ఉందా? లేదా? అనేది తెలుసుకోవచ్చట. కింద పేర్కొన్న లక్షణాలు మీరు గమనించినట్టైతే మీరు మీ గుండె గురించి పెద్దగా ఆందోళన చెందనక్కర్లేదు (Signs of Healthy Heart).

* కఠినమైన వ్యాయామం (Exercise) తర్వాత మీ హృదయ స్పందనల రేటు (Heart Rate) త్వరగా సాధారణానికి వచ్చేస్తున్నట్టైతే మీ గుండె ఆరోగ్యంగా ఉన్నట్టే.

* శృంగార పరంగా (Sexual Health) మీరు చురుగ్గా ఉన్నట్టైతే.. అంటే మీకు అంగస్తంభన సమస్యలేవీ లేకపోయినట్టైతే మీ గుండె గురించి ఆందోళన చెందనక్కర్లేదు.

*మీ నోటి ఆరోగ్యం (Oral Health) కూడా మీ గుండెతో ముడి పడి ఉంది. మీ నోరు దుర్వాసన లేకుండా, తరచుగా దంతాల సమస్యలు, చిగుళ్లు వ్యాధి లేకుండా ఉన్నట్టైతే మీ గుండె పదిలంగా ఉన్నట్టే.

*సాధారణ రక్తపోటు (Blood Pressure) మీ గుండె ఆరోగ్యకరమైన స్థితిలో ఉందని సూచిస్తుంది. నిమిషంలో మీ గుండె 60 నుంచి 100 మధ్యలో కొట్టుకుంటున్నట్టైతే మీరు దిగులు పడనక్కర్లేదు.

*మీ రక్తంలో ట్రైగ్లిజరాయిడ్స్, కొలెస్ట్రాల్ సాధారణ స్థాయిల్లో ఉంటే మీ గుండె ఆరోగ్యంగా ఉన్నట్టే. సాధారణ లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష ద్వారా ఈ విషయం బయటపడుతుంది.

*చిన్న పని చేసినా అలసిపోవడం, ఆయాసం రావడం, శ్వాస సరిగ్గా ఆడకపోవడం వంటి లక్షణాలు మీలో లేకపోతే మీ హృదయం ఆరోగ్యంగా ఉన్నట్టే.

Updated Date - 2023-03-10T17:52:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising