ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shocking: మృత్యుపాశంగా మారిన ఊయల.. ఆడుకుంటుందిలే అనుకున్న ఈ చిన్నారి చివరికి ఎలా చనిపోయిందంటే..

ABN, Publish Date - Dec 15 , 2023 | 09:36 PM

చెల్లెలి కోసం ఏర్పాటు చేసిన ఊయల తన పాలిట మృత్యువుగా మారుతుందని.. పాపం ఆ చిన్నారి ఊహించలేకపోయింది. అందరి పిల్లల్లాగానే స్కూలు నుంచి రాగానే ఎంతో ఆశతో ఊయల ఊగాలని వెళ్లింది. అయితే...

ప్రతీకాత్మక చిత్రం

చెల్లెలి కోసం ఏర్పాటు చేసిన ఊయల తన పాలిట మృత్యువుగా మారుతుందని.. పాపం ఆ చిన్నారి ఊహించలేకపోయింది. అందరి పిల్లల్లాగానే స్కూలు నుంచి రాగానే ఎంతో ఆశతో ఊయల ఊగాలని వెళ్లింది. అయితే ఆ ఊయలే చివరికి చిన్నారి ప్రాణాలను బలిగొంది. ఈ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

కేరళలోని (Kerala) మలప్పురం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కుట్టిప్పురంలో హయా ఫాతిమా (6) అనే బాలిక (girl) .. రోజూమాదిరే గురువారం కూడా స్కూల్‌కి వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చిన బాలిక.. పిల్లలతో కలిసి ఆడుకుంటోంది. ఈ క్రమంలో వారి ఇంటి ఆవరణలో తన చెల్లెలి కోసం ఏర్పాటు చేసిన ఊయలలో ఊగేందుకు వెళ్లింది. అయితే ఊయల ఊగే క్రమంలో ప్రమాదవశాత్తు తాడు మెడకు చుట్టుకుంది. ఊపిరాడకపోవడంతో కొద్ది సేపటికే అపస్మారక స్థితికి చేరుకుంది.

Viral Video: వృద్ధురాలు అని కూడా చూడకుండా.. ఈ కోడలు ఏం చేసిందో చూడండి..

కాసేపటికి గమనించిన కుటుంబ సభ్యులు కంగారుగా ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాలిక మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ‘‘అయ్యో పాపం.. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Viral Photo: ఇది మీ కంటికి పరీక్ష.. ఇందులో ఎలుక ఎక్కడ దాక్కుందో చెప్పగిలిగితే మీరు నిజంగా గ్రేటే..

Updated Date - Dec 15 , 2023 | 09:36 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising