ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అది దేవదూత పేరుతో ప్రసిద్ధిపొందిన అద్భుతమైన ద్వీపం... రోజుకు 180 మందికే అనుమతి... వివరాలివే..

ABN, First Publish Date - 2023-03-21T11:22:08+05:30

ప్రపంచంలో ప్రత్యేకమైన, అందమైన ప్రదేశాలు(Beautiful places) ఎన్నో ఉన్నాయి. ప్రకృతి అందానికి ప్రతిరూపంగా నిలిచిన ఒక ద్వీపం(island) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రపంచంలో ప్రత్యేకమైన, అందమైన ప్రదేశాలు(Beautiful places) ఎన్నో ఉన్నాయి. ప్రకృతి అందానికి ప్రతిరూపంగా నిలిచిన ఒక ద్వీపం(island) గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ద్వీపానికి ఉన్న ప్రత్యేకత(Uniqueness) ఏమిటంటే రోజుకు కేవలం 180 మంది మాత్రమే అక్కడికి వెళ్లేందుకు అవకాశం ఉంది. ఐరోపాకు చెందిన స్కెల్లిగ్ మైఖేల్(Skellig Michael) అనే ఈ ద్వీపం పలు అందమైన దృశ్యాలకు నిలయంగా ఉంది.

ఈ దీవిని ట్విన్ ఐలాండ్(Twin Island) అని కూడా అంటారు. స్కెల్లిగ్ మైకే ద్వీపానికి ప్రధాన దేవదూత(angel) అయిన మైఖేల్ పేరు దీనికి పెట్టారు. ఇది అద్భుతమైన ఆశ్రమానికి ప్రసిద్ధి చెందింది. స్కెల్లిగ్ మైకే ద్వీపంలో గల ఆశ్రమం 6వ, 8వ శతాబ్దాల మధ్య నిర్మితమయ్యిందని చెబుతారు. ఈ ఆశ్రమం సముద్ర మట్టానికి 180 మీటర్ల 600 అడుగుల ఎత్తులో ఉంది, ఇది టెర్రస్ షెల్ఫ్‌(Terrace shelf)లో నిర్మితమయ్యింది. ఈ ఆశ్రమంలో 2 గదులు ఉన్నాయి.

వాటిలో ఒకటి స్మశానవాటిక(Cemetery) కావడం విశేషం. ఈ ద్వీపంలో మధ్యయుగం నాటి చర్చి(Church) కూడా ఉంది. 1996వ సంవత్సరంలో స్కెల్లిగ్ మైకే ద్వీపం UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశం(World Heritage Site)లో చేరింది. ఈ ద్వీపం పాత ఎర్ర ఇసుక రాయి, స్లేట్‌తో రూపొందింది. ఈ ద్వీపం 360 నుండి 374 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిందని చెబుతారు. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందినందున ఈ ద్వీపానికి ప్రతిరోజూ పరిమిత సంఖ్య(limited number)లోనే ప్రజలను అనుమతిస్తారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ద్వీపాన్ని రోజూ 180 మంది మాత్రమే సందర్శించే అవకాశం ఉంది.

Updated Date - 2023-03-21T11:31:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising