ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sleeping: గాఢ నిద్రలో ఉండగా ఎవరైనా మీద కూర్చున్నట్టు అనిపించిందా..? నోట మాట రాలేని పరిస్థితి ఏర్పడిందా..?

ABN, First Publish Date - 2023-03-31T13:53:38+05:30

కొన్ని పీడకలు వచ్చినప్పుడు భయాందోళనకు కూడా గురవుతుంటాం. మెలుకవ వచ్చాక.. భయంకరమైన ఆ పీడ కలను గుర్తుచేసుకుని కంగారు పడిన సందర్భాలు ఉంటాయి. ఇంకొన్ని సార్లు అయితే గాఢ నిద్రలో ఉండగా గుండెల మీద ఎవరో కూర్చున్నట్లు అనిపిస్తుంటుంది. ఆ సమయంలో ఏదో ప్రాణాపాయం జరుగుతుందన్న ఆందోళనతో రక్షించండి అంటూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నిద్ర(Sleeping)లో ఉండగా రకరకాల ఆలోచనలు.. పీడకలు వస్తుంటాయి. మనిషి అన్నాక ఇలా జరగడం సర్వసాధారణం. కొన్ని పీడకలు వచ్చినప్పుడు భయాందోళనకు కూడా గురవుతుంటాం. మెలుకవ వచ్చాక.. భయంకరమైన ఆ పీడ కలను గుర్తుచేసుకుని కంగారు పడిన సందర్భాలు ఉంటాయి. ఇంకొన్ని సార్లు అయితే గాఢ నిద్రలో ఉండగా గుండెల మీద ఎవరో కూర్చున్నట్లు అనిపిస్తుంటుంది. ఆ సమయంలో ఏదో ప్రాణాపాయం జరుగుతుందన్న ఆందోళనతో రక్షించండి అంటూ పైకి అరుస్తునట్లు అనిపిస్తోంది. కానీ ఆ మాట ఎవరికీ వినపించదు. నిద్రలోంచి లేచాక అంత గట్టిగా అరిచినా ఎందుకు పట్టించుకోలేదని ఇంట్లో వాళ్లను తిడుతుంటాం. వాస్తవానికి మనం అరిచినట్లుగా భ్రమ పడడమే తప్ప.. ఇందులో నిజం లేదు. నిద్రలో ఉండగా అలా ఎందుకు జరుగుతుంది? మీకూ ఎప్పుడైనా అలా జరిగిందా? చాలా మంది గుండెల మీద దెయ్యం కూర్చుందని భ్రమ పడుతుంటారు? ఇందులో వాస్తవమెంత? నిజానికి అది దెయ్యమేనా? ఇంకేదైనా? తెలుసుకుందాం.

కలలు అనేవి మెదడులో జరిగే ఒక ప్రతిచర్య. జరిగిన విషయాలను అన్నింటినీ రాత్రి పడుకున్నాక మెదడు నెమరు వేసుకుంటుంది. ఆ సమయంలోనే అవి కలలుగా మనకు అనిపిస్తాయి. అలాగే కలలు వచ్చే సమయంలోనే స్లీప్ పెరాలసిస్ కూడా వస్తుంటుంది. స్లీప్ పెరాలసిస్ (Sleep paralysis) వచ్చిన తర్వాత కొన్ని సెకండ్లలోనే మెళకువ వస్తుంది. అప్పుడే అనిపిస్తుంది తనకు ఏదో అయిందని.. తన మీద ఎవరో కూర్చున్నారని.. దెయ్యం వచ్చి కూర్చుందని భయపడుతుంటారు. చాలామంది స్లీప్ పెరాలిసిస్‌నే దెయ్యం అనుకుంటారు. ఉదయాన్నే లేచి వీటినే కథలుగా చెబుతుంటారు. స్లీప్ పెరాలసిస్ అనేది రాత్రి పూట సహజంగా జరిగే ప్రక్రియ. కానీ దెయ్యం పట్టుకుందంటూ గ్రామాల్లో మంత్రగాళ్ల దగ్గరకు కూడా వెళ్తుంటారు.

ఇది కూడా చదవండి: Gold Shop: వేసిన తాళం వేసినట్టే ఉంది.. కానీ షాపులో బంగారు నగలన్నీ మాయం.. అనుమానంతో ఆ యజమాని షాపంతా వెతికితే..!

గాఢ నిద్రలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికీ ఇలా జరుగుతుంది. నిద్ర సమయంలో కొన్ని క్షణాల పాటు శరీరమంతా పక్షవాతానికి గురవుతుంది. ఇలా అందరికీ జరుగుతుంది. అయితే ఇది ఎంతో సేపు ఉండదు. కేవలం ఒకటి, రెండు నిమిషాల మాత్రమే ఈ పరిస్థితి ఉంటుంది. పడుకున్నప్పుడు ఏదొక సమయంలోనో.. లేదంటే తెల్లవారు జామునో ఇలా జరుగుతుంది. కాకపోతే స్లీప్‌ పెరాలసిస్‌ జరిగినప్పుడు కొన్ని సెకన్ల నుంచి కొన్ని నిమిషాల వరకు కదలలేరు. మాట్లాడలేరు. దీంతో ఉక్కిరిబిక్కిరి అయినట్లు అనిపిస్తుంది. ఇది నార్కోలెప్సీ అనే నిద్ర రుగ్మతకు సంబంధించింది. నిద్రలేమి, తీరికలేకుండా పని చేయడం వల్ల నార్కోలెప్సీ వస్తుంది. నిద్రను నియంత్రించడం వల్ల మెదడులో సమస్య తలెత్తడాన్ని నార్కోలెప్సీ అంటారు. నిద్రలో వచ్చే పక్షవాతం ఒకటి రెండు సార్లు మాత్రం సంభవిస్తుంది.

ఇది కూడా చదవండి: Cooler: వాడకుండా పక్కన పడేసిన పాత కూలర్‌ను మళ్లీ బయటకు తీస్తున్నారా..? వాడే ముందు చేయాల్సిన పనులివీ..!

Updated Date - 2023-03-31T13:53:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising