ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: స్మార్ట్‌ఫోన్లను వాష్ బేసిన్‌లో పడేస్తున్నారేంటనుకుంటున్నారా..? ఈ వీడియోను చూస్తే అవాక్కవడం ఖాయం..!

ABN, First Publish Date - 2023-02-13T18:08:20+05:30

స్మార్ట్ ఫోన్ వాషర్.. 30 సెకెన్లలోనే మీ స్మార్ట్‌ఫోన్‌పై సూక్ష్మక్రిములన్నీ నాశనం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కొవిడ్(Covid) తరువాత ప్రజలకు పరిశుభ్రత పాటించడంపై(Hygiene) అవగాహన పెరిగింది. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, శానిటైజర్ వాడటం(Sanitizer) వంటివి అలవాటయ్యాయి. అయితే.. నిత్యం చేతుల్లోనూ ఉండే స్మార్ట్ ఫోన్లు కూడా సూక్ష్మక్రిములకు నిలయాలే! వ్యక్తిగతంగా ఎంత శుభ్రత పాటించినా కూడా తరచూ స్మార్ట్ ఫోన్లను(Smartphone) వాడటం వల్ల సూక్ష్మక్రిముల బారిన పడే(Bacteria) అవకాశం ఎంతైన ఉంది. అయితే.. ఎలక్ట్రానిక్ ఉపకరణాలను శుభ్రపరచడం అంత ఈజీ విషయం కాదు.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఖరీదైన వస్తువును కోల్పోవాల్సి వస్తుంది.

ఇలాంటి సమస్యలన్నిటీ పరిష్కారంగా జపాన్ వాళ్లు స్మార్ట్ ఫోన్లు శుభ్రపరిచే విధానాన్ని కనిపెట్టారు. అంతేకాకుండా.. దాన్ని వాష్‌బేసిన్‌లోనే ఏర్పాటు చేశారు. ఈ విధానాన్ని మొదటిసారి చూసిన వారెవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఫోన్‌నూ నీళ్లలో వేసి కడగబోతున్నారా అని అనుకుంటూ కంగారు పడాల్సిందే..! వాస్తవానికి జపాన్ నిపుణులు వాష్ బేసిన అంచున స్మార్ట్ ఫోన్ పట్టేంతటి పొడవైన రంధ్రంలో స్మార్ట్‌ఫోన్ డిస్‌ఇన్ఫెక్టెంట్ యంత్రాన్ని (Smartphone Disinfectant Machine) ఏర్పాటు చేశారు.

ఇందులో స్మార్ట్ ఫోన్ పెడితే చాలు.. క్షణాల్లో శుభ్రపడిపోతుంది. దానిపై ఉన్న క్రిములన్నీ నాశనమైపోతాయి. ఇందులో.. స్మార్ట్‌ ఫోన్‌పై అతినీలలోహిత కిరణాలు ప్రసరింపచేయడంతో సెకెన్ల వ్యవధిలోనే బ్యాక్టీరియా, వైరస్ లాంటి వ్యాధికారకాలన్నీ మటుమాయమైపోతాయి. ఈ స్మార్ట్ డిస్‌ఇన్ఫెక్టెంట్ యంత్రానికి WOSH అని పేరు పెట్టారు. కేవలం 30 సెకెన్లలోనే ఇది స్మార్ట్‌ఫోన్లను శుభ్రపరుస్తుంది. మనం వాష్‌బేసిన్లో చేతులు కడుక్కోవడం పూర్తయ్యే లోపే ఇది ఫోన్లను పూర్తిస్థాయిలో శుభ్రపరుస్తుంది. 99.9 శాతం క్రిములను నాశనం చేస్తుంది. తొలుత దీన్ని టోక్యోలోని(Tokyo) మెక్‌డోనల్డ్స్‌ రెస్టారెంట్‌లో(McDonalds) ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన నెట్టింట్లో వైరల్(Viral) అవుతున్న వీడియోను మీరు చూసి ఎంజాయ్ చేయండి..

Updated Date - 2023-02-13T18:08:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising