ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Snake: గుమ్మం ముందే కాపుగాచిన పాము.. రాత్రంతా నిద్రలేకుండా గడిపిన కుటుంబ సభ్యులు.. ఓ బల్ల మీదకు ఎక్కి మరీ..

ABN, First Publish Date - 2023-03-24T10:26:07+05:30

నేను ఇక్కడినుండి కదిలేది లేదంటూ ఆ పాము కూడా కదలకుండా అక్కడే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పాము(Snake) అనే మాట వినబడితే చాలామంది గుండె జల్లుమంటుంది. అందులోనూ నాగుపాము(Cobra) అంటే ప్రమాదమేనని చెప్పాలి. ఓ మహిళ ఎప్పట్లా వంట చేద్దామని వంట గదిలోకి వెళ్ళింది. సామాన్లు తీసుకుంటుండగా బుస్సుమని శబ్ధం వినిపించింది. ఆ శబ్దానికి ఆమె ఉలిక్కిపడింది. చుట్టూ చూడగా గుమ్మం దగ్గరే పడగవిప్పి బుసలు కొడుతోంది నాగుపాము. దాన్నిచూసిన ఆమె పైప్రాణాలు పైనే పోయాయి. గుండె రాయిచేసుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళబుచ్చింది. నేను ఇక్కడినుండి కదిలేది లేదంటూ పాము కూడా కదలకుండా అక్కడే ఉండిపోయింది. ఊహించుకుంటేనే చెమటలు పుట్టించే ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

ఛత్తీస్ ఘర్(Chhattisgarh) రాష్ట్రం కోర్బా(Korba) జిల్లాలో మారుమూల గ్రామంలో సరస్వతి కుటుంబం నివసించేది. వారున్న గ్రామంలో సరైన పంటలు పండక, ఇతర ఆదాయ వనరులు లేక ఇబ్బంది పడేవారు. దీంతో జిల్లాకేంద్రమైన కోర్బాకు వలస వచ్చారు. కోర్బాలో ఒక గది అద్దెకు తీసుకుని కుటుంబ సభ్యులు అందులో ఉంటూ బయట కూలి పనులు చేసుకుని డబ్బు సంపాదించేవారు.వారున్న ఒక గదిలోనే ఒకవైపు వంటగదిలా(Kitchen) మార్చుకున్నారు. సరస్వతి ఎప్పట్లా వంటచెయ్యాలని వంట సామాను తీసుకుంటున్నప్పుడు బుస్సుమని శబ్దం వినిపించింది. ఆ శబ్దానికి ఆమె ఉలిక్కిపడి చుట్టూ చూసింది. ఇంటి గుమ్మంలో పడగవిప్పి బుసలు కొడుతోంది పాము. దాన్ని చూడగానే సరస్వతి గుండె జారిపోయింది. గదిలో నేల మీద పడుకుని ఉన్న భర్త, కొడుకుకు కేక వేసి చెప్పింది. వాళ్ళు పామును చూడగానే భయపడిపోయారు.ఒక్కసారిగా లేచి దగ్గరలో ఉన్న సిమెంట్ గోడపై కూర్చున్నారు. సరస్వతి కూడా ఆ గోడపై కూర్చుని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. అప్పటికే చీకటిపడటంతో ఏం చెయ్యాలో వారికి తోచలేదు. రాత్రంతా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని జాగారం చేశారు. తెల్లవారుతుండగానే వాళ్ళు ముగ్గురూ ఇరుగుపొరుగు వారిని కేకవేసి పిలిచారు.ఇరుగుపొరుగు వారు కిటికిలోంచి సరస్వతి కుటుంబ పరిస్థితి చూసి షాకయ్యారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి సమాచారం అందించారు.

వర్షం పడుతున్నకారణంగా ఫారెస్ట్ డిపార్మెంట్(Forest department) వారు ఆలస్యంగా వచ్చారు.కిటికిలోంచి పాము ఎక్కడుందో చూసి దాన్ని పట్టుకోవడానికి ప్రణాళిక వేసుకున్నారు. ఫారెస్ట్ అధికారులను చూడగానే సరస్వతి బోరున ఏడవడం మొదలుపెట్టింది. 'మమ్మల్ని కాపాడండి సారూ..' అంటూ వాళ్ళను బతిమాలింది. 'మిమ్మల్ని కాపాడటానికే వచ్చాం, ఏం భయపడకండి' అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ధైర్యం చెప్పారు. అంతసేపు పాము అక్కడినుండి కదల్లేదు, సరస్వతి కుటుంబం సిమెంట్ బల్లపైనుండి దిగలేదు. ఫారెస్ట్ డిపార్మెంట్ వారు పామును చాకచక్యంగా పట్టుకున్నతరువాత సరస్వతి కుటుంబం ఊపిరిపీల్చుకుంది. ఎంతలో ప్రాణాపాయం తప్పిపోయిందని కన్నీళ్ళు తుడుచుకుంటూ ఫారెస్ట్ ఆఫీసర్లకు కృతజ్ఞతలు చెప్పింది. ఈ సంఘటన తరువాత ఆ కుటుంబం ఆ గది ఖాళీ చేసి వెళ్ళిపోయింది.

Read also: Viral Video: మా ఇంట్లో జరిగిన ఘోరం.. ఇంకెవరి ఇంట్లోనూ జరగకూడదని ఈ 23 ఏళ్ల యువతి వింత ప్రయత్నం.. రాత్రిళ్లు రోడ్లపై నిల్చుని..


Updated Date - 2023-03-24T10:26:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising