ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Snake Video: బాబోయ్.. నీ ధైర్యానికి దండం తల్లోయ్.. ఒక్కటే అనుకుంటే.. ఒకేసారి బయటపడిన రెండు పాములు.. చివరకు..!

ABN, First Publish Date - 2023-08-19T16:09:38+05:30

పాములంటే (Snakes) భయపడని వారు ఉండరు. మిగతా క్రూర జంతువులతో పోలిస్తే పాములంటేనే ఎక్కువ మంది భయపడతారు. పాములు ఉన్నాయని తెలిస్తే అటు వైపు కూడా వెళ్లరు. కానీ, చాలా కొద్ది మంది మాత్రమే పాములు అంటే భయపడరు. వారు ధైర్యంగా ముందుకెళ్లి పాములను పట్టుకుంటారు.

పాములంటే (Snakes) భయపడని వారు ఉండరు. మిగతా క్రూర జంతువులతో పోలిస్తే పాములంటేనే ఎక్కువ మంది భయపడతారు. పాములు ఉన్నాయని తెలిస్తే అటు వైపు కూడా వెళ్లరు. కానీ, చాలా కొద్ది మంది మాత్రమే పాములు అంటే భయపడరు. వారు ధైర్యంగా ముందుకెళ్లి పాములను పట్టుకుంటారు. ఇళ్లలోకి, ఇతర జనావాసాల్లోకి ప్రవేశించిన పాములను రక్షిస్తారు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Snake Rescue Videos).

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ యువతి టేబుల్ ఎక్కి సీలింగ్ (Snakes in Ceiling) లోకి ఓ కర్రను పెట్టింది. మరుక్షణం ఓ భారీ పాము వచ్చి ఆమె చేతిని చుట్టుకుంది. ఆ వెంటనే మరో పాము కూడా బయటకు వచ్చింది. చాలా పొడవుగా ఉన్న పామును ఆ యువతి చాలా జాగ్రత్తగా సీలింగ్ నుంచి బయటకు తీసింది. అనంతరం ఎలాంటి కంగారూ లేకుండా ఆ రెండు పాములను పట్టుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో @InsaneRealitys అనే ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ అయింది (Snake Videos).

Vande Bharat Travel Rule in Ninght: వందే భారత్ రైళ్లలో రాత్రిళ్లు ప్రయాణిస్తున్నారా..? ఈ రూల్స్‌ ముందే తెలుసుకోండి..!

ఈ వైరల్ వీడియోను ఆస్ట్రేలియాలో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఓ ఇంటి సీలింగ్‌లో చిక్కుకున్న పాములను ఆ యువతి రక్షించింది. ఇప్పటివరకు ఈ వీడియోను 7.75 లక్షల మంది వీక్షించారు. ఐదు వేల మందికి పైగా లైక్ చేశారు. ఆ వీడియోలోని యువతి ధైర్యంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ``ఎంతో ధైర్యవంతురాలు``, ``వీడియో చూస్తే భయం వేసింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-08-19T16:09:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising