Marriage: వధువు మెడలో దండ వేయబోతుండగా సడన్‌గా షాకింగ్ ఘటన.. వరుడి రియాక్షన్స్ చూసి నెటిజన్ల ఫైర్.. ఏం జరిగిందో మీరే చూడండి..!

ABN, First Publish Date - 2023-03-31T18:54:55+05:30

ప్రస్తుతం పెళ్లి వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వధూవరుల డ్యాన్సింగ్ వీడియోలు, పెళ్లిలో జరిగే సరదా ఘటనలు మొదలైనవి నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో అలాంటిది కాదు.

Marriage: వధువు మెడలో దండ వేయబోతుండగా సడన్‌గా షాకింగ్ ఘటన.. వరుడి రియాక్షన్స్ చూసి నెటిజన్ల ఫైర్.. ఏం జరిగిందో మీరే చూడండి..!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రస్తుతం పెళ్లి వీడియోలు (Marriage Videos) సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వధూవరుల డ్యాన్సింగ్ వీడియోలు, పెళ్లిలో జరిగే సరదా ఘటనలు మొదలైనవి నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో (Viral Video) అలాంటిది కాదు. ఆహ్లాదకరంగా పెళ్లి జరుగుతున్న సమయంలో జరిగన ప్రమాద ఘటనకు సంబంధించినది. ఆ వీడియో చూసిన నెటిజన్లు వరుడిని (Groom) తిడుతూ, వధువు సోదరుడిని (Bride`s brother) పొగుడుతూ కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో వధూవరులు వేదికపై నిల్చుని దండలు మార్చుకుంటున్నారు. ఇంతలో వేదికపై అమర్చిన టెంట్‌పై మంటలు (Fire) మొదలయ్యాయి. వరుడు దానిని చూసి భయపడి పక్కకు జరిగాడు. వధువు సోదరుడు మాత్రం వెంటనే అక్కడికి వెళ్లి తన కోటు తీసి దానితో మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు. అక్కడ మంట ఆరిపోగానే మరో చోట మంట మొదలైంది. దానిని కూడా అతడు ఆర్పేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ ఘటన మొత్తంలో వరుడు మాత్రం వధువు చేయి పట్టుకుని పక్కన నిల్చుండిపోయాడు.

Viral News: ఈ పాప కాళ్లు మరీ కట్టెపుల్లల్లా ఇంత సన్నగా ఉన్నాయేంటి..? విస్తుపోతున్న నెటిజన్లు.. అసలు కథేంటంటే..

వధువు సోదరుడికి సహాయం చేసే ప్రయత్నం కూడా చేయలేదు. పక్కన ఉన్న వారితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరుడి ప్రవర్తనపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే వధువు సోదరుడిని ప్రశంసిస్తూ.. ``నిజంగా అలాంటి సోదరుడు ఉండాల``ని కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఖర్మ ఫలితం అంటే ఇదేనేమో.. బైక్‌పై వెళ్తూ ముగ్గురు కుర్రాళ్లు చేసిన తింగరి చేష్టలకు మరుక్షణంలోనే షాకింగ్ రిజల్ట్..!

Updated Date - 2023-03-31T18:54:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising