Viral: వ్యభిచారం చాలా కూల్.. ఫ్రెషర్స్‌కే మంచి డిమాండ్ అంటూ కమెడియన్ వ్యాఖ్యలు.. నెటిజన్ల స్పందన ఏంటంటే..
ABN, First Publish Date - 2023-10-29T18:42:39+05:30
వ్యభిచారంపై లేడీ స్టాండప్ కమెడియన్ విదుషి చేసిన సంచలన వ్యాఖ్యలు పెద్ద సంచలనమే సృష్టిస్తున్నాయి. వ్యభిచారం చాలా కూల్ ప్రొఫెషన్ అంటూ వేదిక మీద ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తుంటే, మరికొందరు ఆమెపై నిప్పులు కురిపిస్తున్నారు.
వ్యభిచారంపై (Prostitution) లేడీ స్టాండప్ కమెడియన్ (Stand-up comedian) విదుషి చేసిన సంచలన వ్యాఖ్యలు పెద్ద సంచలనమే సృష్టిస్తున్నాయి. వ్యభిచారం చాలా కూల్ ప్రొఫెషన్ అంటూ వేదిక మీద ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తుంటే, మరికొందరు ఆమెపై నిప్పులు కురిపిస్తున్నారు. అలాంటి విషయాలపై కామెడీ ఏమిటంటూ మండిపడుతున్నారు. ఏదేైమైనా విదుషి (Vidushi) వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతున్నాయి.
స్టాండప్ కమెడియన్ అయిన విదుషి స్వరూప్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ వ్యభిచారం వృత్తిపై హాస్యం పండించేందుకు ప్రయత్నించింది. ``వ్యభిచారం ఓ కూల్ ప్రొఫెషన్. అనుభవజ్ఞుల కంటే ప్రెషర్స్కే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సీఈవో కంటే ఇంటర్న్స్ ఇక్కడ ఎక్కువ సంపాదిస్తారు`` అంటూ విదుషి తనదైన శైలిలో హాస్యం పండించేందుకు ప్రయత్నించింది. ఆమె వ్యాఖ్యలు అక్కడున్న వారికి విపరీతంగా నవ్వు తెప్పించాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది.
Viral Video: వామ్మో.. అందుకే పిల్లల ముందు అలాంటి పనులు చేయకూడదు.. తల్లి ముందు ఆడుతూ చిన్నారి ఏం చేశాడో చూడండి..!
ఆ వీడియోను ట్విటర్లో 2.3 లక్షల మందికి పైగా వీక్షించారు. విదుషి వ్యాఖ్యలను కొందరు లైట్ తీసుకుంటుంటే.. మరికొందరు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ``ఇలాంటి షోలను చూడడానికి వెళ్లేవారు అలాంటివి ఎలా భరిస్తున్నారో``, ``వ్యభిచారం కూల్ కాదు.. అక్కడ ఎంత కష్టం, అవమానాలు, కన్నీళ్లు ఉంటాయో ఎవరికీ తెలియదు``, ``అలాంటప్పుడు ఆమె కామెడీని ఎందుకు తన ప్రొఫెషన్‌గా తీసుకుంది``, ``ఆమె వ్యాఖ్యలను సరదాగానే తీసుకోవాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-10-29T20:44:33+05:30 IST