Girls Hostel: అర్ధరాత్రి గర్ల్స్ హాస్టల్‌లో తనిఖీలు.. 89 మంది మిస్సింగ్ అని తెలిసి అంతా షాక్.. ఫోన్లు చేసి ఆరా తీస్తే..!
ABN, First Publish Date - 2023-08-23T18:54:43+05:30
ఉత్తరప్రదేశ్‌లోని కస్తూర్భా గాంధీ గర్ల్స్ హాస్టల్‌కు సంబంధించి షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ గర్ల్స్ హాస్టల్‌లో 100 మంది బాలికలు ఉండాల్సి ఉండగా.. తనిఖీకి వెళ్లిన అధికారులకు కేవలం 11 మంది అమ్మాయిలు మాత్రమే కనిపించారు. షాకైన అధికారులు హాస్టల్ వార్డెన్‌ను ప్రశ్నించగా ఆమె సరైన సమాధానం చెప్పలేకపోయారు.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని కస్తూర్భా గాంధీ గర్ల్స్ హాస్టల్‌కు సంబంధించి షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ గర్ల్స్ హాస్టల్ (Girls Hostel)లో 100 మంది బాలికలు ఉండాల్సి ఉండగా.. తనిఖీకి వెళ్లిన అధికారులకు కేవలం 11 మంది అమ్మాయిలు మాత్రమే కనిపించారు. షాకైన అధికారులు హాస్టల్ వార్డెన్‌ను ప్రశ్నించగా ఆమె సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఈ ఘటన స్థానికంగానే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై అధికారులు దర్యాఫ్తు ప్రారంభించారు (89 Girls Missing from hostel).
యూపీలోని గోండా జిల్లా పరాస్‌పూర్ ప్రాంతంలో ఉన్న కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను సోమవారం రాత్రి అధికారులు తనిఖీ చేశారు (Night Inspection). ఆ హాస్టల్ లో 100 మంది బాలికలు ఉండాల్సి ఉండగా.. 89 మంది కనిపించకుండా పోయారు. దీంతో ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల హాస్టల్ వార్డెన్‌తో సహా నలుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మిగిలిన అమ్మాయిలు ఏమయ్యారు అని అడిగితే హాస్టల్ వార్డెన్ సరితా సింగ్ సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. దీంతో అధికారులు దర్యాఫ్తునకు ఆదేశించారు.
Viral News: ఇంటికి చేరని 8 ఏళ్ల కొడుకు.. మూడు గంటలు లిఫ్ట్‌లోనే.. ఒక్కడే ఏం చేశాడంటే..!
నిజానికి ఆ అమ్మాయిలందరూ వారి వారి ఇళ్లలోనే ఉన్నారు. అందరికీ అధికారులు ఫోన్లు చేసి ఆరాతీయగా వారు ఇళ్లలోనే ఉన్నట్టు తేలింది. అయినప్పటికీ హాస్టల్ వార్డెన్ వారు హాస్టల్‌లోనే ఉన్నట్టు ఫేక్ అటెండెన్స్ వేసేస్తోంది. ఆ వార్డెన్‌పై జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్టు జిల్లా బేసిక్ శిక్షా అధికారి ప్రేమ్‌చంద్ తెలిపారు. పాఠశాల వార్డెన్, ఫుల్‌టైమ్ టీచర్, వాచ్‌మెన్, గేట్ డ్యూటీ చేసే వాచ్‌మెన్‌పై కేసులు నమోదు చేశారు. హాస్టల్ నుంచి అంత మంది అమ్మాయిలు మిస్ అవడం స్థానికంగా సంచలనంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన చర్చనీయాంశం అయింది.
Updated Date - 2023-08-23T18:59:47+05:30 IST