Tax Notice: ఇదేం ట్విస్ట్ బాబోయ్.. 10 ఏళ్ల క్రితమే చనిపోయిన మహిళకు ట్యాక్స్ నోటీస్.. రూ.7.56 కోట్ల పన్ను కట్టండంటూ..!
ABN, First Publish Date - 2023-08-02T12:19:23+05:30
ఆ కుటుంబ సభ్యులు చేసిన ఒకే ఒక నిర్లక్ష్యపు పని ఇంత సమస్యకు దారితీసింది..
ఒకటి రెండు కాదు ఏకంగా 7.56కోట్ల పన్ను. అది కూడా 10ఏళ్ళ క్రితమే చనిపోయిన మహిళ పేరున నోటీసు వచ్చింది. ఈ విషయం విన్నవాళ్లకే ఆశ్చర్యం వేస్తుంది. ఇక ఆ ఇంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. 'మాకేమీ తెలియదు బాబోయ్ ఈ ట్యాక్స్ గురించి' అని నెత్తీ, నోరు బాదుకుని మొరపెట్టుకుంటున్నారు వారు. 'ప్రభుత్వం మరీ ఇలా చేస్తోందేంటి? చనిపోయిన వారి పేరుమీద కోట్ల కొద్ది ట్యాక్స్ నోటీసు పంపడమేంటీ' అనే డైలమా నెలకొంది. ప్రస్తుతం దేశం యావత్తు ఈ ట్యాక్స్ నోటీసు గురించే చర్చ జరుగుతోంది. ఆ కుటుంబ సభ్యులు చేసిన ఒకే ఒక నిర్లక్ష్యపు పనివల్ల ఇదంతా చోటుచేసుకుంది. అసలు ఈ ట్యాక్స్ ఎలా వచ్చింది? ఎక్కడ పొరపాటు జరిగింది? పూర్తీగా తెలుసుకుంటే..
మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రంలో వింత సంఘటన చోటుచేసుకుంది. బేతుల్ పోలిస్ స్టేషన్ పరిధిలో ఉషా సోనీ అనే మహిళ ఇంటికి ట్యాక్స్ కట్టమంటూ 7.56కోట్ల రూపాయల నోటీసు వచ్చింది(7.56 crores tax notice). ఈ నోటీసు చూసిన ఇంటిల్లిపాదీ షాకయ్యారు. ఉషాసోనీ టీచర్ గా పనిచేసేది. ఆమె 10ఏళ్ళ కిందట కాలేయ సంబంధిత సమస్యతో పోరాడుతూ మృతిచెందింది. ఆమె మరణించి ఇన్నేళ్లు గడిచిన తరువాత ట్యాక్స్ నోటీసు రావడం ఏంటని ఆమె కుటుంబ సభ్యులు అయోమయానికి గురయ్యారు. అదే విషయాన్ని బేతుల్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని పోలీస్ సూపరిడెంట్ కు నివేదించారు. సదరు ట్యాక్స్ నోటీసు 2017-18 సంవత్సరంలో జరిగిన లావాదేవీకి సంబంధించినదని ధృవీకరించారు.
Bhavish Aggarwal: ప్రేయసి దగ్గర అప్పులు చేసి మరీ పెట్టిన కంపెనీయే.. ఇప్పుడు ఫుల్లు ఫేమస్.. ఇతడెవరో గుర్తు పట్టారా..?
ఉషాసోనీ 2013లో మరణించింది. ఆమె మరణించిన తరువాత ఆమె పాన్ కార్డ్ గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఆమె పాన్ కార్డ్ తో నేచురల్ కాస్టింగ్ అనే సంస్థ మరొక కంపెనీకి స్క్రాప్ ను విక్రయించిందని, ఆ చెల్లింపులకు ఉషాసోనీ పాన్ కార్డ్ ఉపయోగించారని పన్ను శాఖ అధికారులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇతరులు పాన్ కార్డ్ దుర్వినియోగం చేశారని అంటున్నారు(Pan card misused). ట్యాక్స్ నోటీసులో పేర్కొన్నట్టు 7.56కోట్లు చెల్లించేంత తాహతు తమకు లేదని ఉషా సోనీ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. 'ప్రైవేటు కంపెనీలో పనిచేసే మాకు అంత పన్ను చెల్లించే ఆర్థిక లావాదేవీలు ఏవీ లేవు. పోలీసులు, పన్ను శాఖ అధికారులు మాకు సహకరించి పాన్ కార్డు దుర్వినియోగం చేసినవారిని పట్టుకుని శిక్షించాలి' అని ఉషాసోనీ కొడుకు అభ్యర్థించాడు. ఐటీ శాఖ అధికారుల నుండి సమాచారం అందుకున్న తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని బేతుల్ ఏస్పీ తెలిపారు. మరణాంతరం వ్యక్తుల పాన్ కార్డ్ రద్దు చేయించడం అందరూ చేయాల్సిన ముఖ్యమైన పని అని పేర్కొన్నారు.
Amazon Great Freedom Festival Sale: అమెజాన్ సేల్ వచ్చేస్తోంది.. ఏఏ వస్తువులపై ఎంతెంత డిస్కౌంట్ ఇస్తోందంటే..!
Updated Date - 2023-08-02T12:19:23+05:30 IST