ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tea: చల్లగా అయిపోయిన తరువాత టీ ని మళ్లీ వేడి చేస్తున్నారా? ఈ నిజాలు తెలిస్తే..

ABN, First Publish Date - 2023-10-10T15:02:29+05:30

టీ చల్లగా అయిపోతే మళ్లీ వేడిచేసుకుని తాగడం చాలామంది చేసే పనే. అయితే ఇలా చల్లగా అయిపోయిన టీని మళ్లీ వేడి చేసుకుని తాగడం మంచిదేనా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..

కాఫీ, టీ లు ప్రజల రోజులో భాగం అయిపోయాయి. వాటిని తాగకపోతే రోజు మొత్తం ఏ పనీ కుదురుగా చెయ్యలేని వారు ఉన్నారు. ఉదయం, సాయంత్రం మాత్రమే కాకుండా వర్క్ చేస్తున్నప్పుడు, స్నేహితులతో బయటకు వెళ్లినప్పుడు చాలాసార్లు టీ తాగుతారు. కొన్నిసార్లు ఇంట్లో టీ తయారుచేసినప్పుడు మిగిలిపోవడం, లేదా ఏదైనా పనిలో పడి టీ కొద్దిసేపు పక్కన పెట్టడం చేస్తుంటారు. అలాంటప్పుడు టీ చల్లగా అయిపోతుంది. దాన్ని మళ్లీ వేడిచేసుకుని తాగడం చాలామంది చేసే పనే. అయితే ఇలా చల్లగా అయిపోయిన టీని మళ్లీ వేడి చేసుకుని తాగడం మంచిదేనా? టీని మళ్లీ మళ్లి వేడి చేసుకుని తాగితే ఏమవుతుంది? టీ ప్రియులు అందరూ తెలుసుకోవాల్సిన విషయమిది..

టీ(Tea) అనేది ఒక ఎమోషన్. ఉదయం, సాయంత్రం పక్కాగా టీ తాగాల్సిందే. అయితే ఇంట్లో మిగిలిపోయినా, లేదా తాగడం ఆలస్యం అయినా టీ చల్లగా అయిపోతుంది. చల్లగా అయిన టీని మళ్లీ వేడి చేసి తాగడం(Tea reheating) శరీరాన్ని ప్రమాదంలోకి నెట్టడమే అంటున్నారు. బ్లాక్ టీ తయారుచేసిన కొద్దిసేపటికి చల్లగా అయితే దాన్ని మళ్లీ కొద్దిసేపట్లోనే వేడిచేయడం పర్వాలేదు. కానీ మిల్క్ టీ ని వేడిచేయడం మాత్రం చాలా ప్రమాదమట.

Viral: ప్రపంచంలో రెండవ అతిపెద్ద హిందూ దేవాలయం.. ఎక్కడో తెలిస్తే షాకవుతారు..


ఒకసారి తయారుచేసిన తరువాత ఆ టీని మళ్లీ మళ్లీ వేడిచేయడం వల్ల టాక్సిన్(toxin) లు విడుదల అవుతాయి. టీ చేసిన తరువాత నాలుగు గంటలు దాన్ని అలాగే ఉంచి తరువాత వేడి చేస్తే మాత్రం అది చాలా ప్రమాదకరమైన టాక్సిన్లు విడుదల చేస్తుంది. పైగా అలాంటి టీ బ్యాక్టీరియా పెరుగుదలకు ఆవాసంగా మారుతుంది. మరీ ముఖ్యంగా పాలతో తయారుచేసిన టీని మళ్లీ వేడి చేయడం అస్సలు మంచిది కాదు. పాలు, పంచదార బ్యాక్టీరియా పెరగడానికి చాలా అవకాశం కల్పిస్తాయి. ఇక బయట టీ తాగే అలవాటు ఉన్నవారికి పెద్ద షాకింగ్ న్యూస్ ఏమిటంటే.. బయట టీ అమ్మేవారు దాన్ని గంటల తరబడి ఉడికిస్తారు. అంతసేపు ఉడికిన టీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని పరిశోధనలు చెబుతున్నాయి.

Health Tips: కొరియన్ అమ్మాయిల అందం వెనుక రహస్యం ఇదేనా.. కేవలం ఇదొక్కటి తాగడం వల్ల అంత మ్యాజిక్కా..


Updated Date - 2023-10-10T15:02:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising