Padma Awards: దిల్ రాజు, రాఘవేంద్ర రావు, ఆనంద్ సాయిని ‘పద్మ శ్రీ’ కి ప్రతిపాదించిన తెలంగాణ సర్కారు!
ABN, First Publish Date - 2023-01-27T15:49:32+05:30
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎమ్ఎమ్. కీరవాణి (MM. Keeravani) ని పద్మ శ్రీ వరించింది. కేంద్రం ఈ అవార్డులను ప్రకటించే ముందు ప్రతి రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు తీసుకుంటుంది.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎమ్ఎమ్. కీరవాణి (MM. Keeravani) ని పద్మ శ్రీ వరించింది. కేంద్రం ఈ అవార్డులను ప్రకటించే ముందు ప్రతి రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు తీసుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వానికి 31మంది పేర్లను సిఫారసు చేసింది. పద్మ విభూషణ్‌కు మూడు, పద్మ భూషణ్‌కు మూడు, పద్మ శ్రీకి 25మంది పేర్లను ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనల్లో సినిమా రంగానికి చెందిన వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju), దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (Raghavendra Rao), ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి (Anand Sai) వంటి వారు ఈ జాబితాలో ఉండటం చెప్పుకోదగ్గ విశేషం.
దర్శకుడు, నిర్మాత బి. నర్సింగ్ రావు, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దివంగత దొరస్వామి రాజు, దివంగత నటుడు కైకాల సత్యనారాయణ, నిర్మాత బసిరెడ్డి కొత్త, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దివంగత నారాయణదాస్ నారంగ్‌ను రాష్ట్రం ప్రతిపాదించింది. ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్య, టీఎస్ జెన్ కో, ట్రాన్స్ కో సీఎండీ. ప్రభాకర్ రావును పద్మ శ్రీ కి సిఫారసు చేసింది. ప్రముఖ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, సివిల్ సర్వెంట్ నారాయణ సింగ్ భాటి, పెయింటర్ కాలాల లక్ష్మణ్ గౌడ్‌ను పద్మ భూషణ్‌కు ప్రతిపాదించింది. ప్రముఖ డ్యాన్సర్స్ రాజా రెడ్డి, రాధా రెడ్డి పేర్లను పద్మ విభూషణ్‌కు సిఫారసు చేసింది. డాక్టర్ ఎన్ గోపి, సింగీతం శ్రీనివాసరావు ల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
Updated Date - 2023-01-27T15:56:01+05:30 IST