ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Money: పేపర్ ముక్కలు కాదండోయ్.. కరెన్సీ నోట్లే.. ఓ వృద్ధురాలు కష్టపడి రూ.5.40 లక్షలను దాచుకుంటే..!

ABN, First Publish Date - 2023-08-02T19:39:29+05:30

‘‘రాజుల సొమ్ము రాళ్ల పాలు’’ అన్నట్లుగా.. కొన్నిసార్లు ఏళ్లకు ఏళ్లు కూడబెట్టుకున్న సొమ్ము మొత్తం ఉన్నట్టుండి హారతి కర్పూరంలా కరిగిపోతుంటుంది. మరికొన్నిసార్లు దొంగలు దోచుకోవడమో లేదా అగ్నికి ఆహుతి అవడమో జరుగుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన...

‘‘రాజుల సొమ్ము రాళ్ల పాలు’’ అన్నట్లుగా.. కొన్నిసార్లు ఏళ్లకు ఏళ్లు కూడబెట్టుకున్న సొమ్ము మొత్తం ఉన్నట్టుండి హారతి కర్పూరంలా కరిగిపోతుంటుంది. మరికొన్నిసార్లు దొంగలు దోచుకోవడమో లేదా అగ్నికి ఆహుతి అవడమో జరుగుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే బామ్మకు విచిత్ర సమస్య వచ్చి పడింది. మక్కాకు వెళ్దామనే కోరికతో ఓ బామ్మ ఏన్నో ఏళ్లుగా డబ్బులు కూడబెడుతూ మొత్తం రూ.5.40 లక్షలు సంపాదించింది. చివరకు వాటిని లెక్కపెట్టేందుకు పెట్టె తెరచి చూడగా.. ఏం జరిగిందంటే..

మలేషియాకు చెందిన ఓ వృద్ధురాలికి (Malaysian old woman) మక్కాకు వెళ్లాలని కోరిక ఉండేది. అయితే అందుకు తగ్గ డబ్బులు తన వద్ద లేకపోవడంతో వాయిదా వేసుకుంటూ వచ్చింది. అయితే ఎలాగైనా మక్కా వెళ్లాలని నిర్ణయించుకుని డబ్బులు కూడబెడుతూ వచ్చింది. ఏది ఏమైనా 2024లో మక్కాకు (mecca) వెళ్లేలా ప్లాన్ చేసుకుని, కొన్నేళ్లుగా ఎంతో కష్టపడుతూ, వచ్చిన డబ్బులను మొత్తం ఓ పెట్టెలో (Cash hidden in a box) దాచుకుంటూ వచ్చింది. ఇలా మొత్తం రూ.5.40లక్షలను సంపాదించింది. అయితే ఇటీవల నగదును లెక్కపెట్టేందుకు ఆమె మనువడు పెట్టెను ఓపెన్ చేశాడు. అయితే అందులో మంచి నోట్లకు బదులుగా చిరిగిన నోట్లు కనిపించాయి.

World's Richest Woman: అంబానీ కాదు.. ఆదానీ కూడా కాదు.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలు ఈమేనట.. ఆస్తి ఎంతో తెలిస్తే..!

చివరకు పరిశీలించగా చెదపురుగుల (termites) కారణంగా ఇలా జరిగినట్లు తెలిసింది. మక్కాకు వెళ్లాలన్న తన కల.. కళ్ల ముందే కల్లలుగా మారడంతో వృద్ధురాలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. పాక్షికంగా దెబ్బతిన్న కరెన్సీ నోట్లను బ్యాంకులో సమర్పించినట్లు వృద్ధురాలు మనువడు తెలిపాడు. తన బామ్మకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ ఫొటోలను సోషల్ మీబడియాలీో షేర్ చేశాడు. ‘‘మక్కాకు వెళ్లేందుకు తన అమ్మమ్మకు ఇంకా సమయం రానట్లు ఉంది’’.. అని పేర్కొన్నాడు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘నగదును ఇంట్లో ఉంచుకోవడం కంటే బంగారు కొని దాచుకోవడం మేలు’’.. అని కొందరు, ‘‘అయ్యో! ఎంత ఘోరం జరిగింది’’.. అని మరికొందరు, ‘‘బామ్మ కల త్వరగా నెరవేరాలని ఆకాంక్షిస్తున్నాం’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Snake Video: నడిరోడ్డుపై నాగుపాము.. వెళ్లిపోతోంది కదా అని దాని పక్కనుంచే బైక్‌పై ఇద్దరు కుర్రాళ్లు దూసుకెళ్తోంటే..!

Updated Date - 2023-08-02T19:39:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising