China: రూటు మార్చిన చైనా కంపెనీలు.. లో దుస్తుల ప్రకటనల్లో అమ్మాయిలు నటించకూడదని ప్రభుత్వం నిషేధిస్తే..
ABN, First Publish Date - 2023-03-04T16:30:12+05:30
ఎత్తుకు పై ఎత్తులు అనే మాట ఎప్పుడైనా విన్నారా? మనం అప్పుడప్పుడు వింటుంటాం. అలాగే తాడిని తన్నే వాడుంటే.. తలను తన్నే వాడుంటాడంటారు. ఇలాంటి డైలాగ్‌లు పొలిటికల్ సర్కిల్‌లో ఎక్కువగా వింటుంటాం. అప్పుడప్పుడు మనుషుల కూడా
ఎత్తుకు పై ఎత్తులు అనే మాట ఎప్పుడైనా విన్నారా? మనం అప్పుడప్పుడు వింటుంటాం. అలాగే తాడిని తన్నే వాడుంటే.. తలను తన్నే వాడుంటాడంటారు. ఇలాంటి డైలాగ్‌లు పొలిటికల్ సర్కిల్‌లో ఎక్కువగా వింటుంటాం. అప్పుడప్పుడు మనుషుల కూడా ఆయా సందర్భాల్లో వాడుకగా వాడుతుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.
వ్యాపారస్తులు రకరకాల మాటలు చెప్పి వస్తువులను అమ్ముతుంటారు. కొంత మంది రుచి చూసి.. నచ్చితే డబ్బులు ఇవ్వండి లేదంటే ఇవ్వక్కర్లేదు అంటారు. ఇది వ్యాపార నైజం. ఏదైనా అమ్మేందుకు ఇలా ఎన్నో తెలివి తేటలు ఉపయోగిస్తుంటారు వ్యాపారస్తులు. ఇక షాపింగ్ మాల్స్ (Shopping malls) అయితే చెప్పనక్కర్లేదు.. విద్యుత్ దీపాలతో అట్రాక్షన్ చేస్తుంటారు.. రకరకాల మోడల్స్‌తో ప్రచారం చేస్తుంటారు. ఇది బిజినెస్‌మేన్‌లు చేసే జిమ్మిక్కులు. ఇక ఆన్‌లైన్ షాపింగ్స్ వచ్చాక ఈ విధానం శృతిమించింది. స్త్రీలను అశ్లీలంగా చూపించడం. లో దుస్తుల్లో అసభ్యంగా ప్రదర్శించడంపై స్త్రీ జాతికి అవమానకరంగా మారింది. అయితే దీనిపై చైనా ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. వాణిజ్య ప్రకటనల్లో స్త్రీలను ఉపయోగించడంపై చైనా బ్యాన్ (China) విధించింది. దీంతో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అంతే దెబ్బకు దెబ్బ చెల్లి అన్నట్టు వ్యాపారస్తులు (business people) కొత్త పంథాను ఎంచుకున్నారు.
ఇది కూడా చదవండి: షాకింగ్ ఘటన.. పక్కింటి వాళ్లు పెళ్లికి పిలవలేదని ఓ వ్యక్తి వింత నిర్వాకం..!
లోదుస్తుల ఆన్‌లైన్ ప్రకటనల్లో (Advertisement) అమ్మాయిలు ఉండటం వల్ల అశ్లీలత శృతిమించుతోందన్న ఉద్దేశంతో చైనా ప్రభుత్వం నిషేధం విధించింది. ఆన్‌లైన్ ప్రచారాలకు ఆడవాళ్లను ఉపయోగించవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీని కోసం ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. దీంతో ఆన్‌లైన్ వ్యాపార నిర్వాహకులు నష్టాల్లో కూరుకుపోయారు. దీనిని అధిగమించేందుకు కొన్ని ఆన్‌లైన్ (Online) సంస్థలు కొత్త మార్గాన్ని ఎంచుకున్నాయి. అమ్మాయిల స్థానంలో అబ్బాయిలను నియమించుకొని వారితో మోడలింగ్ చేయించడం ప్రారంభించారు. ఇది కొంత మేర మంచి ఫలితాన్నే ఇచ్చింది. దీంతో మిగతా వారు కూడా అదే పద్ధతిని ఫాలో అయ్యారు. అమ్మాయిల స్థానంలో అబ్బాయిలను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం అమ్మాయిల లోదుస్తులు వేసుకున్న పురుష (China Modeling) మోడల్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అయితే లోదుస్తులు వేసుకున్న పురుష మోడల్స్ వీడియోలపై రకరకాల కామెంట్లు వెల్లువెత్తుతున్నట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ‘ఆ దుస్తులు అమ్మాయిల కంటే.. అబ్బాయిలు వేసుకుంటేనే బాగుంది కదా’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. అలాగే మరో యూజర్ కామెంట్ చేస్తూ.. షేక్స్‌పియర్ కాలంలోనూ వాణిజ్య ప్రకటనల్లో నటించేందుకు మహిళలకు అనుమతించలేదు. అప్పుడు కూడా మగవాళ్లే వారి పాత్రల్లో నటించేవారు’ అని కామెంట్ చేశాడు. ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో (Social media) కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
ఇది కూడా చదవండి: షాకింగ్ ఘటన.. పక్కింటి వాళ్లు పెళ్లికి పిలవలేదని ఓ వ్యక్తి వింత నిర్వాకం..!
Updated Date - 2023-03-04T16:32:06+05:30 IST