Surprise Gift: కలలో కూడా ఊహించని సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన కంపెనీ.. ఈమెయిల్స్‌ను చూసి అవాక్కైన ఉద్యోగులు..!
ABN, First Publish Date - 2023-03-17T16:49:12+05:30
ఓ కంపెనీ ఉద్యోగులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ (Surprise Gift) అందించింది. కలలో కూడా ఊహించని ఆ ఉద్యోగులు కంపెనీ తీసుకున్న నిర్ణయానికి ఉబ్బితబ్బిబయ్యారు.
ఓ కంపెనీ ఉద్యోగులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ (Surprise Gift) అందించింది. కలలో కూడా ఊహించని ఆ ఉద్యోగులు కంపెనీ తీసుకున్న నిర్ణయానికి ఉబ్బితబ్బిబయ్యారు. ఇంతకీ ఆ కంపెనీ ఇచ్చిన బహుమానం ఏంటి? ఉద్యోగులు అంత సంబరపడానికి కారణం ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
ఏ కంపెనీ అయినా ఉద్యోగులతో ఎంత వీలుంటే అంత పని చేయించుకుంటాయి. ఒక్కోసారి వీక్ ఆఫ్‌లు కూడా క్యాన్సిల్ చేయించి కూడా అదనంగా వర్క్ చేయించుకున్న దాఖలాలు కనిపిస్తుంటాయి. కానీ బెంగళూరులో ఓ కంపెనీ మాత్రం పని చేయించుకోవడమే కాకుండా వారి క్షేమాన్ని కూడా ఆలోచించింది. అంతే తడువుగా ఓ నిర్ణయాన్ని తీసుకుంది. ఆఫీస్‌కు రాకుండా హాయిగా ఇంట్లో నిద్రపోండి అంటూ ఓ కంపెనీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఉద్యోగుల్లో మెరుగైన ఆరోగ్య సూత్రాలను ప్రోత్సహించేందుకు బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్చి 17న అంతర్జాతీయ నిద్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికారికంగా సెలవు ప్రకటిస్తూ ఈమెయిల్ పంపించింది.
వేక్‌ఫిట్ సొల్యూషన్స్ అనే డీ2సీ హోమ్ అండ్ స్లీప్ సొల్యూషన్స్ స్టార్టప్ కంపెనీ లింక్డ్ ఇన్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. ఉద్యోగులందరికీ పంపిన మెయిల్ స్క్రీన్‌షాట్. ‘సర్‌ప్రైజ్ హాలిడే: అనౌన్సింగ్ ది గిఫ్ట్ ఆఫ్ స్లీప్’ అనేది దాని ట్యాగ్‌లైన్. గత సంవత్సరం కూడా ఈ కంపెనీ తమ ఉద్యోగులకు ‘రైట్ టు నాప్ పాలసీ’ని ప్రకటించింది. దీని ద్వారా ఉద్యోగులందరూ తమ పని వేళల్లో 30 నిమిషాల నిద్రపోవచ్చని సమాచారం. శరీరాన్ని రీఛార్జ్ చేసి పనిపై దృష్టి కేంద్రీకరించడంలో మధ్యాహ్న నిద్ర ఉపకరిస్తుంది. తద్వారా ఉత్పాదకత పెరుగుతుందని ఆ కంపెనీ భావిస్తోంది. అంతేకాకుండా ఇతర కంపెనీలు కూడా ఇలాంటి ఆలోచన చేయాలని పిలుపునిచ్చింది.
ఇది కూడా చదవండి: Ayyanna Patrudu: ఉత్తరాంధ్రులు జగన్‌ను ఛీ కొట్టారు
Updated Date - 2023-03-17T16:49:12+05:30 IST