పొట్ట ఎత్తుగా అవుతోందేంటని అడిగిన తల్లి.. సాకులు చెప్పి నిజాన్ని దాచిన 15 ఏళ్ల కూతురు.. సడన్‌గా ఓ రోజు తల్లికి ఓ పార్శిల్‌ను చూపించి..
ABN, First Publish Date - 2023-03-06T18:32:57+05:30
యూట్యూబ్ లో వీడియోస్ చూసి ఆ అమ్మాయి చేసిన పనికి..
'ఏమైందే.. నీ కడుపేంటి అలా ఎత్తుగా కనిపిస్తోంది, ఏమయ్యింది?' అని కూతురిని ప్రశ్నించింది ఆ తల్లి. 'నాకు కడుపుకు సంబంధించిన సమస్య ఉంది. అది తగ్గడానికి టైం పడుతుందని డాక్టర్ చెప్పింది. నువ్వేం కంగారు పడకమ్మా' అని నచ్చజెప్పింది కూతురు. అలా ఒకటి రెండు కాదు చాలా రోజుల పాటు మైంటైన్ చేసింది. ఒకరోజు తల్లి బయటకు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చి, కూతురిని చూసి షాకయ్యంది. 'నీ పొట్ట సమస్య ఎలా తీరిపోయిందే ఉన్నట్టుండి ఎలా తగ్గింది' అని అడిగింది. ఆ కూతురు ఒక పార్శిల్ తీసుకొచ్చి తల్లి చేతుల్లో పెట్టి భోరున విలపించింది. 15సంవత్సరాల బాలిక జీవితంలో జరిగిన దారుణమైన సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్ర(Maharastra) రాష్ట్రం నాగ్ పూర్(Nagpur) లో 15సంవత్సరాల బాలిక తన తల్లితో కలసి నివసిస్తోంది. ఆ అమ్మాయికి సోషల్ మీడియాలో(Social Media) ఒక వ్యక్తితో పరిచయం అయింది. తెలిసీ తెలియని ఆకర్షణ వయసులో ఆ అమ్మాయి అతనితో స్నేహం చేసింది. అయితే అమ్మాయి అమయకత్వాన్ని ఆసరా చేసుకుని సదరు వ్యక్తి ఆ అమ్మాయిని లోబరుచుకున్నాడు. తన అవసరం తీర్చుకున్నాడు. ఫలితంగా ఆ అమ్మాయి గర్భం దాల్చింది. క్రమంగా పొట్ట పెరగడం మొదలయింది. 'ఏమైంది.. ఆ పొట్ట ఏంటి?' అని తల్లి నిలదీస్తే పొట్టకు సంబంధించిన సమస్య ఉందంటూ తల్లిని మాయచేసింది. ఆ పిచ్చితల్లి తన కూతురు చెప్పింది నిజమేనని నమ్మింది.
తల్లి ఇంట్లో లేని సమయంలో ఇంటి దగ్గరే 'నార్మల్ డెలివరీ కావడం ఎలా?' అనే విషయాన్ని యూట్యూబ్ లో చూసి తెలుసుకుంది. తరువాత ఒకరోజు తల్లి ఇంట్లో లేని సమయంలో ఆ అమ్మాయి పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ పుట్టిన వెంటనే ఆ బిడ్డను గొంతు పిసికి చంపేసింది. అనంతరం పార్శల్ చేసి ఇంట్లో ఒక పెట్టెలో భద్రపరిచింది. ఇంటికి తిరిగొచ్చిన తల్లి కూతురి పొట్ట ఎత్తు తగ్గి ఉండటం, ఆ అమ్మాయి నీరసంగా ఉండటం చూసి ఏమయిందని ఆరా తీసింది. ఆ అమ్మాయి పెట్టెలో భద్రపరిచిన శిశువు మృతదేహ పార్శిల్ తీసుకొచ్చి తల్లిచేతుల్లో పెట్టి నిజమంతా చెప్పేసింది. కూతురి మాటలు విన్న తల్లి షాకయింది. ఆ నుండి తేరుకుని వెంటనే అమ్మాయిని హాస్పిటల్ కు తీసుకెళ్ళి వైద్యులకు చూపించింది. వైద్యులు విషయం మొత్తం ఆరా తీసి ఆశ్చర్యపోయారు, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శిశువు మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టుమార్టం కు పంపారు.లైంగక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం బాలిక మీద హత్యకేసు నమోదు అవుతుందని తెలిపారు.
Updated Date - 2023-03-06T18:32:57+05:30 IST