ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రోల్‌ బంకులో షాకింగ్ సీన్.. కారును ఆపకుండానే 43 లీటర్ల డీజిల్‌ను కొట్టించుకున్న ఓ డ్రైవర్ చేసిన నిర్వాకమిదీ..!

ABN, First Publish Date - 2023-03-08T15:38:05+05:30

కొందరు పైకి హుందాగా కనిపించినా.. వారు చేసే పనులు మాత్రం చాలా హీనంగా ఉంటాయి. కొందరు డబ్బులు ఉన్న వారు కూడా చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడడం రోజూ చూస్తూనే ఉన్నాం. ఇటీవలే ఓ వ్యక్తి ఖరీదైన కారులో వచ్చి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కొందరు పైకి హుందాగా కనిపించినా.. వారు చేసే పనులు మాత్రం చాలా హీనంగా ఉంటాయి. కొందరు డబ్బులు ఉన్న వారు కూడా చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడడం రోజూ చూస్తూనే ఉన్నాం. ఇటీవలే ఓ వ్యక్తి ఖరీదైన కారులో వచ్చి, రోడ్డు పక్కన పూల మొక్కలను ఎత్తుకెళ్లడం కూడా చూశాం. తాజాగా, ఓ వ్యక్తి కారులో హుందాగా వచ్చి బండి ఆపకుండానే డీజిల్ పట్టించుకున్నారు. మొత్తం 43 లీటర్ల డీజిల్ కొట్టించుకున్న తర్వాత ఏం చేశాడంటే..

రాజస్థాన్ (Rajasthan) అజ్మీర్‌లోని మంగ్లియావాస్ బైపాస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. జెథానా ప్రాంతానికి చెందిన సూర్య ప్రకాష్ అనే వ్యక్తి.. స్థానిక బైపాస్ వద్ద సూరజ్ ట్రేడర్స్ పేరుతో హెచ్‌పీ పెట్రోల్ బంక్ (Petrol Bunk) నిర్వహిస్తున్నాడు. ఇదిలావుండగా, మార్చి 6వ తేదీ వేకువజాము 5గంటలకు పెట్రోల్ బంక్ వద్ద షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో సత్యనారాయణ్ అనే వ్యక్తి విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో షిప్ట్ డిజైర్ కారు (Shift Desire car) పెట్రోల్ పట్టించుకోవడానికి వచ్చింది. కారు యజమాని రూ.4వేలకు డీజల్ పట్టమనడంతో.. ఉద్యోగి ఆ పనిలో పడ్డాడు. మొత్తం 43 లీటర్ల డీజిల్ పట్టాగానే కారు ముందుకు కదలడం ప్రారంభించింది. డీజిల్‌కు డబ్బులు ఇవ్వాల్సిన కారు యజమాని.. అందుకు విరుద్ధంగా కారును ముందుకు కదిలించడంతో ఉద్యోగి షాక్ అయ్యాడు. పెట్రోల్ పంపును ఇంకా బయటికి తీయకముందే కారు కదలడంతో ఆపమంటూ గట్టిగా అరిచాడు.

Viral Video: కోటి మందికి పైగా చూసిన వీడియో.. లక్షల కొద్దీ లైకులు.. ఇంతకీ ఈ బురద నీళ్లల్లో ఇతడేం చేస్తున్నాడంటే..

అంతలో కారు ఇంకా వేగంగా ముందుకు కదిలింది. చూస్తుండగానే కారు మరింత వేగంతో అక్కడి నుంచి రోడ్డు మీదకు వెళ్లిపోయింది. డీజిల్ పంపు కారుకు ఇరుక్కోవడంతో చివరకు మొత్తం తెగి కిందపడింది. బంకు ఉద్యోగి (Petrol station employee) కారు వెనుకే కొంచెం దూరం పెరుగెత్తి చివరకు నిరాశగా వెనక్కు వచ్చాడు. వెంటనే బంకు యజమానికి సమాచారం అందించాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో (CC camera videos) రికార్డు అయింది. స్థానిక పోలీస్ స్టేషన్‌కి చేరుకున్న యజమాని.. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న కారు యజమానిని పట్టుకునే పనిలో పడ్డారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: పురి విప్పిన నెమలిపై దాడి చేసిన పులి.. చివరలో ఎవరూ ఊహించని ట్విస్ట్..

Updated Date - 2023-03-08T15:38:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising