Viral News: రోడ్డుపై కుక్కతో కలిసి కూర్చుని ఏడుస్తున్న మహిళ.. గమనించిన ఆటో డ్రైవర్ చివరికి ఏం చేశాడంటే..

ABN, First Publish Date - 2023-05-23T15:20:05+05:30

మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు.. ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే చూస్తుంటారు. కొందరైతే సాయం చేస్తున్నట్లు నటిస్తూ చివరికి దారుణాలకు తెగబడుతుంటారు. తమ దారిలోకి రాకుంటే చివరకు హత్య చేయడానికి కూడా వెనుకాడరు. అయితే మహిళలకు సాయం చేసి, అందరితో..

Viral News: రోడ్డుపై కుక్కతో కలిసి కూర్చుని ఏడుస్తున్న మహిళ.. గమనించిన ఆటో డ్రైవర్ చివరికి ఏం చేశాడంటే..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు.. ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే చూస్తుంటారు. కొందరైతే సాయం చేస్తున్నట్లు నటిస్తూ చివరికి దారుణాలకు తెగబడుతుంటారు. తమ దారిలోకి రాకుంటే చివరకు హత్య చేయడానికి కూడా వెనుకాడరు. అయితే మహిళలకు సాయం చేసి, అందరితో శభాష్ అని అనిపించుకునే వారు కూడా చాలా మంది ఉంటారు. ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడో చోట చోటు చేసుకుంటూనే ఉంటాయి. ప్రస్తుతం ఓ ఆటో డ్రైవర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కుక్కను పట్టుకుని వచ్చిన మహిళ... రోడ్డుపై ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంది. ఆమెను గమనించిన ఓ ఆటో డ్రైవర్ తన మానవత్వాన్ని చాటుకున్నాడు. ఇతడు చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

సోషల్ మీడియాలో ఆటో డ్రైవర్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు (Viral photos and videos) తెగ వైరల్ అవుతున్నాయి. ఓ మహిళ (woman) తన పెంపుడు కుక్కకు (pet dog) వైద్యం చేయించేందుకు ఆస్పత్రికి వెళ్లింది. చికిత్స చేయించిన అనంతరం తిరిగి ఇంటికి వెళ్లేందుకు రోడ్డు పైకి వచ్చింది. అయితే కుక్కను చూసి చాలా మంది ఆటో డ్రైవర్లు ఆమెను ఎక్కించుకునేందుకు నిరాకరించారు. ఇలా చాలా సేపు ప్రయత్నించినా ఎవరూ లిఫ్ట్ ఇవ్వలేదు. దీంతో రోడ్డుపై కూర్చుని ఏడుస్తూ ఉంది. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ ఆటో డ్రైవర్ (Auto driver) .. మహిళను గమనిస్తాడు.

Crime News: భార్యాభర్తల గొడవలు చూసి యువకుడి సలహా.. ఓ రోజు మహిళను గెస్ట్ హౌస్‌కి పిలిచి.. చివరకు అతడు చేసిన నిర్వాకం..

విషయం తెలుసుకున్న ఆటో డ్రైవర్.. ‘‘నాకు జంతువులంటే చాలా ఇష్టం.. నా ఆటో ఎక్కమ్మా!.. నిన్ను క్షేమంగా ఇంటి వద్ద దింపుతా’’.. అని ధైర్యం చెప్పాడు. అతడి మాటలు నమ్మిన మహిళ.. కుక్కను తీసుకుని ఆటో ఎక్కింది. చెప్పిన మాట ప్రకారమే ఆటో డ్రైవర్.. ఆమెను క్షేమంగా ఇంటి వద్ద దింపాడు. దీంతో సదరు మహిళ ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురవుతుంది. ఆటో డ్రైవర్‌కు కృతజ్ఞతలు తెలియజేసింది. ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఆటో డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ఆటో డ్రైవర్లు ఉంటే.. మహిళలకు భద్రత ఉంటుంది’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: కోబ్రాకు చుక్కలు చూపించిన కోతి.. కాటు నుంచి తప్పించుకుంటూనే చివరకు ఏం చేసిందో చూడండి..

Updated Date - 2023-05-23T15:20:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising