Mobile Phone: మొబైల్ కోసం కుర్రాడు ఎంతకి తెగించాడంటే.. ఫోన్ వాడొద్దన్నందుకు మామయ్యపై దాడికి దిగి దారుణం..
ABN, First Publish Date - 2023-03-26T15:45:51+05:30
ప్రస్తుతం చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ మొబైల్ మాయలో పడిపోయారు. స్మార్ట్ ఫోన్ లేనిదే రోజు గడవని విధంగా తయారయ్యారు. ముఖ్యంగా యువత మొబైల్స్‌కు బానిసలైపోయారు.
ప్రస్తుతం చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ మొబైల్ (Mobile) మాయలో పడిపోయారు. స్మార్ట్ ఫోన్ (Smart Phone) లేనిదే రోజు గడవని విధంగా తయారయ్యారు. ముఖ్యంగా యువత మొబైల్స్‌కు బానిసలైపోయారు. వాటి కోసం ఎంత దారుణాలకైనా తెగిస్తున్నారు. తాజాగా ఓ కుర్రాడు మొబైల్ కోసం తన మామయ్యను అతి దారుణంగా కొట్టి చంపాడు. విద్యార్థి దశలోనే జైలు పాలయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) మీరట్‌లో ఈ దారుణం వెలుగు చూసింది.
మీరట్‌లో ఓ మొబైల్ కోసం మేనమామను మేనల్లుడు ఇటుకతో కొట్టి హత్య చేశాడు. శనివారం ఉదయం మామ ఇస్రార్, మేనల్లుడు దీన్ మధ్య మొబైల్ వాడకం విషయమై గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన ఇస్రార్.. మేనల్లుడి ఫోన్‌ను విసిరేశాడు. ఫోన్ పగిలిపోవడంతో కోపోద్రిక్తుడైన మేనల్లుడు మేనమామపై దాడికి దిగాడు. అతడిని ఇటుకతో మూడు నాలుగు సార్లు కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. దెబ్బలు బలంగా తగలడంతో మామ స్పృహ తప్పి పడిపోయాడు (Crime News).
Viral: తన భర్తకు మరో యువతిని గిఫ్ట్‌గా ఇచ్చిన భార్య.. ఇదంతా ఆమె ఎందుకు చేసిందో తెలిస్తే షాకవక తప్పదు..
తీవ్ర రక్త స్రావం కావడంతో బంధువులు వెంటనే ఇస్రార్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెడికల్ కాలేజీకి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి అతడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడైన దీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Snake bite: పాము కాటేసినా పరీక్ష రాస్తానని పట్టుబట్టిన బాలిక.. చివరకు ఆమె పరిస్థితి ఏమైందంటే..
Updated Date - 2023-03-26T15:45:51+05:30 IST