ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Married Life: కొత్తగా పెళ్లయిందా..? సంసార జీవితం సజావుగా సాగాలంటే.. ఈ 3 రూల్స్‌ను పాటిస్తే సరి.. అస్సలు గొడవలే ఉండవ్..!

ABN, First Publish Date - 2023-10-18T11:49:18+05:30

అందుకే తగాదాలు ఎంత తక్కువగా ఉంటే భార్యాభర్తలకు అంత మంచిది. ప్రతి చిన్న విషయానికి తగాదా పడటం, వాదులాడు కోవడం వల్ల అందరిలో చులకన కావడం, నలుగురికీ మన పరిస్థితి తెలియడం జరుగుతుంది.

responsibility

వివాహం అనేది ఇద్దరు కలిసి నిర్ణయించుకునే జీవిత పయనం. దీనికి చాలా కలిసిరావాలి, నమ్మకం మీద పునాది వేసుకుంటూ జీవితాన్ని అందమైన ప్రయాణంగా మలుచుకోవాలి. అయితే ప్రతి విషయానికి గొడవపడే దంపతులు తెలుసుకోవాల్సిన చాలా విషయాలు పెద్దలు చెప్పినా కూడా చెవికి ఎక్కనివి కొన్ని అనుభవాలే నేర్పుతాయి. అందులో కొన్ని చెప్పుకుంటే.. చిన్న చిన్న చిట్కాలతో గొడవలే లేకుండా సంసార జీవితం సజావుగా సాగుతుంది. అసలు విషయంలోకి వెళితే..

కొత్తగా వివాహ జీవితాన్ని ప్రారంభించిన జంటల్లో ముందులో ఉన్న సఖ్యత అంతగా ఉండదు.. అస్తమానూ కీచులాడుకుంటూ జీవితాన్ని గందరగోళం చేసుకుంటూ ఉంటారు. అయితే.. వివాహం అనేది పరస్పర అంగీకారంతో ప్రారంభమయ్యే ఇద్దరు వ్యక్తుల కలయిక. ఈ సంబంధాన్ని నడపాలంటే ప్రేమతో పాటు అవగాహన కూడా అవసరం. అందువల్ల, బాధ్యతతో నిండిన ఈ బంధంలోకి ప్రవేశించే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రతి వ్యక్తి జీవితంలో ప్రతి సందర్భంలోనూ భార్యా భర్తలిద్దరూ అవగాహనతో, పరస్పర అంగీకారంతో పూర్తిచేస్తూ వస్తే ఎలాంటి గందరగోళం ఉండదు. కానీ వివాహం విజయవంతం కావాలంటే మాత్రం ఇద్దరి మధ్యలో సఖ్యత చాలా అవసరం.

అత్తమామలను అనుసరించండి.

ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకుంటే, కుటుంబం గురించి ప్రస్తావించిన చోట చాలా విషయాలు జరుగుతాయి. అటువంటి పరిస్థితిలో, మాటలను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ప్రతి కుటుంబానికి దాని తగినట్టుగానే అత్తమామలు, కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటాలి. కుటుంబ సభ్యుల గురించి ఏ విషయాన్ని నలుగురిలో పంచుకోకూడదు. అలాగే సంసారం విషయాలను పంచుకోకూడదు.

ఇది కూడా చదవండి: అమ్మ బాబోయ్.. టాయ్‌లెట్ సీటు కంటే కూడా ఫ్రిడ్జ్ డోర్ చాలా ప్రమాదకరమా..? ఫ్రిడ్జ్‌లో పాలను అక్కడే ఎందుకు పెట్టాలంటే..!

గొడవలు తగ్గించాలి..

వివాహ బంధం చాలా సున్నితమైనది, అందుకే తగాదాలు ఎంత తక్కువగా ఉంటే భార్యాభర్తలకు అంత మంచిది. ప్రతి చిన్న విషయానికి తగాదా పడటం, వాదులాడు కోవడం వల్ల అందరిలో చులకన కావడం, నలుగురికీ మన పరిస్థితి తెలియడం జరుగుతుంది. కాబట్టి ఇంటికి గుట్టు అనవసం.


ప్రతి చిన్న విషయానికి భాగస్వామితో గొడవ పడటం తెలివైన పని కాదు. వీలైనంత హాయిగా మాట్లాడి ప్రతి సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఏదైనా పెద్ద సమస్య ఉంటే తప్ప పెద్దగా మాట్లాడకపోవడం మంచిది.

భాగస్వామి అనుబంధ శైలిని అర్థం చేసుకోండి.

వివేకం మాత్రమే వివాహాన్ని దీర్ఘకాలంలో సంతోషంగా ఉంచదు. భార్యాభర్తల మధ్య శృంగారం చాలా ముఖ్యం. ఒకరి అవసరాలను ఒకరు అర్థం చేసుకోవడం వల్ల బంధం మరింత బలపడుతుంది. ఈ చిట్కాలతో జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు.

Updated Date - 2023-10-18T12:02:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising