ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UPI transaction: రోజూ యూపీఐ పేమెంట్లు చేసేవారికి కీలక సమాచారం..

ABN, First Publish Date - 2023-06-07T22:13:27+05:30

పాపులారిటీ పొందుతున్నప్పటికీ యూపీఐ పేమెంట్లకు పరిధులు ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ (HDFC), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఐసీఐసీఐ (ICICI) వంటి బ్యాంకులు లావాదేవీలపై పరిమితులు విధించడమే ఇందుకు కారణంగా ఉంది. మరి ఏ బ్యాంకుల పరిమితి ఎంత? అనే విషయానలు పరిశీలిద్దాం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశవ్యాప్తంగా యూపీఐ పేమెంట్లు (UPI payments) భారీగా పెరిగాయి. దేశంలో 2016లో ప్రారంభమైనప్పటికీ అనతి కాలంలోనే ఈ పేమెంట్లు జోరందుకున్నాయి. ముఖ్యంగా కరోనా తర్వాత మరింత పెరిగాయి. 2022లో యూపీఐ లావాదేవీల విలువ ఏకంగా రూ.149.5 లక్షల కోట్లుగా ఉందంటే ఏ స్థాయిలో దేశంలో ఏ స్థాయిలో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. భద్రతతోపాటు సులభంగా వినియోగించే అవకాశం ఉండడంతో అంతకంతకూ జనాదరణ పెరుగుతోంది. అయితే పాపులారిటీ పొందుతున్నప్పటికీ యూపీఐ పేమెంట్లకు పరిధులు ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ (HDFC), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఐసీఐసీఐ (ICICI) వంటి బ్యాంకులు లావాదేవీలపై పరిమితులు విధించడమే ఇందుకు కారణంగా ఉంది. మరి ఏ బ్యాంకుల పరిమితి ఎంత? అనే విషయానలు పరిశీలిద్దాం...

ఒక వినియోగదారుడు యూపీఐ ద్వారా ఒక రోజులో గరిష్ఠంగా రూ.1 లక్ష వరకు మాత్రమే ట్రాన్సాక్షన్ చేసేలా ఎన్‌పీసీఐ (National Payments Corporation of India) నిబంధన విధించింది. అయితే ఈ గరిష్ఠ పరిమితి బ్యాంకులపై ఆధారపడి రూ.25 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకుల యూపీఐ పరిమితులు ఏవిధంగా ఉన్నాయో గమనిద్దాం.. కెనరా బ్యాంక్ యూపీఐ ట్రాన్స్క్షన్ గరిష్ఠ పరిమితి రోజుకు రూ.25 వేలుగా ఉంది. అంటే రోజు రూ.25 వేలు మాత్రమే ఆ బ్యాంక్ ఖాతాదారులు ట్రాన్సాక్షన్ చేయగలుగుతారు. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా లిమిట్ కూడా రూ.25 వేలుగానే ఉంది.

ఎస్‌బీఐ పరిమితి ఎంతంటే...

దేశంలోనే అతిపెద్ద బ్యాంకయిన ఎస్‌బీఐ యూపీఐ పరిమితి రోజుకు గరిష్ఠంగా రూ.1 లక్షగా ఉంది. ఎస్‌బీఐ మాదిరిగానే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిట్ కూడా రూ.1 లక్షగానే ఉంది. అయితే కొత్త యూజర్లకు మాత్రం ఈ పరిమితి రూ.5 వేలుగానే ఉంటుంది. ఇక ఐసీఐసీఐ కస్టమర్లు రోజుకు రూ.10 వేల వరకు చేసుకోవచ్చు. యాక్సిస్ బ్యాంక్ యూపీఐ పేమెంట్ పరిమితి రూ.1 లక్షగా ఉంది. అయితే కొన్ని బ్యాంకులు రోజువారీ పరిమితికి బదులు... వారానికి పరిమితి విధిస్తాయి. ఉదాహరణకు ఐడీఎఫ్‌సీ బ్యాంక్ యూపీఐ లిమిట్ వారానికి రూ.1 లక్షగా ఉంది. నెలకు రూ.30 లక్షలుగా ఉంది. మరో విషయం ఏంటంటే లావాదేవీ విలువకు పరిమితి మాత్రమే కాకుండా.. లావాదేవీల సంఖ్యకు కూడా ఎన్‌పీసీఐ పరిమితి విధించింది. కొత్త నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి రోజుకు 20 సార్లు యూపీఐ ట్రాన్సాక్షన్స్ నిర్వహించవచ్చు. ఆ తర్వాత కొత్త 24 గంటలు ఎదురుచూడాల్సి ఉంటుంది. అయితే ఈ పరిమితి కూడా బ్యాంకులను బట్టి ఉంటుంది.

యూపీఐ యాప్ లిమిట్...

గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి పేమెంట్ యాప్స్ రోజుకు రూ.1 లక్ష పరిమితిని నిర్ణయించాయి. అన్ని యూపీఐ యాప్స్, బ్యాంక్ అకౌంట్లకు రోజువారీ లావాదేవీల సంఖ్య 10గా ఉంది. మరో విషయం ఏంటంటే గూగుల్ పే వినియోగదారుడు ఎవరైనా రూ.2 వేల కంటే ఎక్కువ మనీ రిక్వెస్ట్ పెడితే డైలీ ట్రాన్సాక్షన్ లిమిట్‌ను ఈ యాప్ నిలిపివేస్తుంది. అమెజాన్ పే యూపీఐ కొత్త కస్టమర్‌కు మొదటి 24 గంటల పరిమితిని కేవలం రూ.5 వేలుగా నిర్దేశించింది.

Updated Date - 2023-06-07T22:23:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising