ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

February 1: సిద్ధమవ్వండి.. ఫిబ్రవరి 1 నుంచి డబ్బు సంబంధిత మార్పులివే!

ABN, First Publish Date - 2023-01-31T16:37:53+05:30

ఆర్థికాంశాలు (Money matters) కాలానుగుణంగా మారుతుంటాయి. ప్రభుత్వాలు, సంస్థలు తీసుకొచ్చే నూతన నిబంధనలపై ఈ మార్పులు ఆధారపడి ఉంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆర్థికాంశాలు (Money matters) కాలానుగుణంగా మారుతుంటాయి. ప్రభుత్వాలు, సంస్థలు తీసుకొచ్చే నూతన నిబంధనలపై ఈ మార్పులు ఆధారపడి ఉంటాయి. ఫిబ్రవరి 2023 నుంచి కొన్ని కీలకమైన ఆర్థిక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. అవేంటో మీరూ ఓ లుక్కేయండి...

పార్లమెంట్ ముందుకు బడ్జెట్ 2023-24

2024 సార్వత్రిక ఎన్నికలకు (General Elections) ముందు కేంద్ర ప్రభుత్వం (Central Govt) ప్రవేశపెట్టబోతున్న చిట్టచివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ను (Budget2023) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmal sitaraman) ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతున్నారు. అయితే బడ్జెట్‌లో వచ్చే ప్రకటనలు మాత్రం ఏప్రిల్ 1 నుంచి మొదలుకానున్న ఆర్థిక సంవత్సరం 2023-24 నుంచే ఆచరణలోకి రాబోతున్నాయి. ఎన్నికల ముందు పూర్తిస్థాయి బడ్జెట్‌ కావడంతో వివిధ వర్గాలు చాలా ఆశలు పెట్టుకున్నాయి. ఆర్థిక సంవత్సరం 2023-24లో సామాన్యుల జేబులపై ప్రత్యక్ష ప్రభావం ఏవిధంగా ఉండబోతోందనేది ఫిబ్రవరి 1, 2023న తేలనుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్..

బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) క్రెడిట్ కార్డ్ (Credit cards) కస్టమర్లకు కాస్త భారమైన విషయం ఇదీ. క్రెడిట్ కార్డ్ ద్వారా రెంట్ పేమెంట్ లావాదేవీలపై (Rent payment transactions) 1 శాతం ఛార్జీలను విధించనున్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. ఈ కొత్త నిబంధన ఫిబ్రవరి 1, 2023 నుంచి అమల్లోకి రానుందని తెలిపింది. ఉదాహరణకు.. ఎవరైనా కస్టమర్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి రూ.10,500 అద్దె చెల్లిస్తే 1 శాతం ఫీజు అంటే రూ.105 ఛార్జీగా చెల్లించాల్సి ఉంటుందని ప్రకటనలో వివరించింది.

ఎల్‌పీజీ ధరల్లో మార్పులు..

గ్యాస్ కంపెనీలు ప్రతి నెల మొదటి రోజున ఎల్‌పీజీ సిలిండర్ (LPG cylinders) ధరలను సవరిస్తుంటాయి. తదునుగుణంగా ఫిబ్రవరి 1న కూడా ధరల సవరణ ఉండే అవకాశం ఉంది. మరి ఎల్‌పీజీ రేట్లు (LPG rates) పెరుగుతాయా లేక తగ్గుతాయా అనేది వేచిచూడాల్సిందే.

టాటా కార్లు మరింత ప్రియం..

దేశీయ మార్కెట్లో టాటా మోటార్ (TATA Motor) కార్లకు ఉండే క్రేజ్ వేరే లెవల్. అయితే కంపెనీకి చెందిన కార్లు ఫిబ్రవరి 1, 2023 నుంచి మరింత ప్రియమవ్వబోతున్నాయి. ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోయిన కారణంగా కార్ల ధరలను స్వల్పంగా పెంచుతున్నట్టు కంపెనీ ప్రకటించింది. కారు వేరియెంట్, మోడల్‌ ఆధారంగా ధరలు సగటున 1.2 శాతం వరకు పెరగనున్నాయని తెలిపింది. ఈ ధరల పెరుగుదల ఫిబ్రవరి 1 నుంచే అమల్లోకి రానున్నట్టు స్పష్టం చేసింది.

మరోవైపు, కెనరా బ్యాంక్ (Canara bank) డెబిట్ కార్డులపై (Debit cards) సర్వీసు ఛార్జీలను పెంచుతున్నట్టు వెల్లడించింది. క్లాసిక్ డెబిట్ కార్డ్స్ వార్షిక ఫీజును రూ.125 నుంచి రూ.200 లకు పెంచింది. కార్డులను బట్టి ఛార్జీల పెంపులో వ్యత్యాసం ఉంటుందని, ఈ పెంపు ఫిబ్రవరి 13, 2023 నుంచి అమల్లోకి రాబోతున్నట్టు తెలిపింది. మరోవైపు ఈ నెలలోనే జరగనున్న ఆర్బీఐ ఎంపీసీ భేటీలో (RBI MPC Meet) గృహ రుణ రేట్లను ఇదే స్థాయిలో కొనసాగించనుందా లేక పెంచనుందా అనేది తెలియనుంది.

Updated Date - 2023-01-31T16:44:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising