Highest Paid Government Jobs: అల్లాటప్పా ప్రభుత్వోద్యోగాలు కాదండోయ్.. ఈ పది జాబ్స్‌లో ఒక్కటి కొట్టినా చాలు..!

ABN, First Publish Date - 2023-04-15T20:31:49+05:30

ప్రభుత్వ ఉద్యోగం ఉంటే జీవితానికి ఓ భరోసా. 60 ఏళ్లు గుండెలపై చేయి పెట్టుకుని హ్యాపీగా లైఫ్‌ను లాగించేయవచ్చు.

Highest Paid Government Jobs: అల్లాటప్పా ప్రభుత్వోద్యోగాలు కాదండోయ్.. ఈ పది జాబ్స్‌లో ఒక్కటి కొట్టినా చాలు..!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వ ఉద్యోగం ఉంటే జీవితానికి ఓ భరోసా. 60 ఏళ్లు గుండెలపై చేయి పెట్టుకుని హ్యాపీగా లైఫ్‌ను లాగించేయవచ్చు. ఇక గవర్నమెంట్ జాబ్ ఉంటే ఆ హుందాతనమే వేరు. సమాజంలో గౌరవం, మంచి జీతం, వీటికి తోడు ఇతర సౌకర్యాలకు కొదవే ఉండదు. అందుకే లైఫ్‌లో సెటిల్ కావాలనుకునే వారు మొదట కొరుకునేది ప్రభుత్వ ఉద్యోగం. దాని కోసం ఎంతటి కష్టానైనా భరించేవారు, ఎంత సమయానైనా వెచ్చించేవారు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మనం ఇండియాలో అధిక శాలరీతో పాటు మంచి గౌరవప్రదమైన టాప్-10 ప్రభుత్వోద్యోగాల గురించి తెలుసుకుందాం. ఈ పది జాబ్స్‌లో ఒక్కటి కొట్టినా చాలు. లైఫ్‌లాంగ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు.

1) ఐఏఎస్ అండ్ ఐపీఎస్

దేశంలోనే అత్యున్నత సర్వీసుల్లో సివిల్ సర్వీసెస్ టాప్‌లో ఉంటాయి. ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS), ఐఎఫ్ఎస్ ఇలా పలు సివిల్ సర్వీస్ ఉద్యోగాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ (Union Public Service) భర్తీ చేస్తుంది. ఐఏఎస్‌గా సెలెక్ట్ అయితే జిల్లా కలెక్టర్‌గా (District Collector) పోస్టింగ్ ఉంటుంది. జిల్లా పరిపాలన వ్యవహారాలు మొత్తం ఒక జిల్లా కలెక్టర్ చేతిలోనే ఉంటాయి. ఇక ఐపీఎస్‌కు సెలెక్ట్ అయితే ఎస్పీగా పోస్టింగ్ ఉంటది. వీరికి 7వ పే కమిషన్ కింద వీరికి జీతం చెల్లించడం జరుగుతుంది. ఐఏఎస్‌కు మొదట నెలకు రూ.56,100 జీతం చెల్లిస్తారు. అయితే, కొన్ని నెలల తర్వాత జీతం 1 లక్షకు చేరుతుంది. జీతం కాకుండా ఐఏఎస్, ఐపీఎస్‌లకు ప్రయాణం, ఆరోగ్యం, వసతి సహా అనేక రకాల అలవెన్సుల కోసం కూడా డబ్బు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ ఉద్యోగ నియమకాలు మొత్తం యూపీఎస్‌సీ ఆధ్యర్యంలోనే జరుగుతాయి. ప్రీలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా వీరి సెలెక్షన్ అనేది ఉంటుంది.

Viral Video: 8 ఏళ్లుగా అన్నయ్యా అని పిలిచి.. చివరకు అతడినే పెళ్లి చేసుకుందట.. ఘాటు కామెంట్స్‌తో నెటిజన్ల రియాక్షన్ మామూలుగా లేదుగా..!


2) ఎన్‌డీఏ అండ్ డిఫెన్స్ సర్వీసులు

భారతీయ త్రివిద దళాలు ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఇండియన్ ఆర్మీ (Indian Army). ఎన్‌డీఏ, సీడీఎస్, ఏఎఫ్‌సీఏటీ తదితర డిఫెన్స్ జాబ్స్‌కు మంచి శాలరీలు ఉంటాయి. వీటిలో లెఫ్టినెంట్ స్థాయి పోస్టులకు యూపీఎస్‌సీ (UPSC) ఎగ్జామ్ నిర్వహిస్తుంది. ప్రీలిమ్స్, మెయిన్స్, జీడీ, ఫిజికల్ టెస్ట్, పీఈటీ టెస్ట్, ఇంటర్వ్యూ ఇలా అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారిని ఈ జాబ్స్‌లో తీసుకుంటారు. వీటిలో లెఫ్టినెంట్ స్థాయి పోస్టులకు స్టార్టింగ్ శాలరీ రూ.68వేలు ఉంటుంది. ఆ తర్వాత వీరు మేజర్‌గా ప్రమోషన్ పొందితే 1లక్ష రూపాయల వరకు జీతం వస్తుంది. ఇక దేశ రక్షణలో కీలకమైన జవాన్లకు ఇతర అలెవెన్సులు కూడా బాగానే ఉంటాయి.

3. ఇస్రో (ISRO), డీఆర్‌డీఓ (DRDO) శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు

రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌పై ఆసక్తి ఉన్న ఇంజినీరింగ్ అభ్యర్థులు ఇస్రో (ISRO), డీఆర్‌డీఓ (DRDO) లలో సైంటిస్ట్‌లు మరియు ఇంజనీర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ సంస్థల్లో పనిచేసే వారికి అత్యుత్తమ వసతి సౌకర్యాలు లభిస్తాయి. అలాగే ఈ సంస్థలలో పని చేయడం ద్వారా సమాజంలో అపారమైన గౌరవం లభిస్తుంది. వీరికి మొదట్లో రూ. 60 వేల వరకు జీతం ఉంటుందని సమాచారం. ఆ తర్వాత కొంతకాలానికి జీతం దాదాపు 1లక్షకు లేదా అంతకంటే ఎక్కువ అవుతుంది.

4. ఆర్‌బీఐ గ్రేడ్-బీ

బ్యాంకింగ్‌లో ఆర్‌బీఐ (RBI) గ్రేడ్-బీలో ఎంపికైన అభ్యర్థులు భారీ జీతం ఉంటుంది. మీకు బ్యాంకింగ్ రంగంపై ఆసక్తి ఉంటే, మీ కెరీర్‌ను ప్రారంభించడానికి ఆర్‌బీఐ గ్రేడ్-బీ ఉత్తమ పోస్ట్. ఆర్‌బీఐలో డిప్యూటీ గవర్నర్ స్థాయికి పదోన్నతి పొందవచ్చు. ఇక ఆర్‌బీఐ పరీక్షను విడిగా నిర్వహిస్తుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు 3BHK ఫ్లాట్‌ను సైతం పొందుతారు. అలాగే గ్రేడ్-బీ పోస్టుల ఉద్యోగుల పిల్లలకు ఉచిత విద్య సదుపాయం ఉంటుంది. గ్రేడ్-బీ కింద ఎంపికైన వారికి ప్రారంభ వేతనం రూ. 67,000 ఉంటుంది.

Viral Video: ఎన్ని సార్లు అడిగినా ముఖానికి చుట్టుకున్న స్కార్ఫ్‌ను తీసేయని ప్రేయసి.. అనుమానంతో ఆ ప్రియుడు ముసుగు తీసేసి చూస్తే..

5. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్

ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (Indian Forest Services Exam) కింద ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ జీతమే రూ.60,000 వరకు ఇస్తారు. ఆ తర్వాత కొంతకాలానికి జీతం పెరిగి 1లక్ష వరకు చేరుతుంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ కోసం అభ్యర్థుల ఎంపిక ఫారెస్ట్ సర్వీసెస్ (Forest Services Exam) ఎగ్జామ్ కింద జరుగుతుంది. ఇందుకోసం యూపీఎస్సీ (UPSC) పరీక్షను నిర్వహిస్తుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ తర్వాత అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

6. పీఎస్‌యూ (PSU) ఉద్యోగాలు

ప్రభుత్వ రంగ సంస్థలైన (Public Sector Undertaking) బీహెచ్ఈఎల్ (BHEL), ఐఓసీఎల్ (IOCL), ఓఎన్‌జీసీ (ONGC) లలో మంచి ఉద్యోగాలు ఉంటాయి. ఇంజినీరింగ్ పూర్తి చేసినవారు పీఎస్‌యూ (PSU)లో ఉద్యోగం పొందడానికి గేట్ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. పీఎస్‌యూలలో ఎంపికైన ఇంజనీర్లకు ప్రారంభ వేతనం రూ.60వేలు ఉంటుంది.

7. అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు లెక్చరర్

వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో బోధించే ప్రొఫెసర్లు, లెక్చరర్లకు ప్రారంభ వేతనం సుమారు రూ. 50వేల వరకు ఉంటుంది. అయితే, అనుభవం, పదోన్నతితో జీతం రూ.1లక్ష వరకు అందకోవచ్చు.

Viral Video: ఆమెతో మాట్లాడాలి.. ఎవరైనా వెళ్లి నాకు ఫోన్ చేయించండంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్.. ఇంతకీ ఈమె ఎవరంటే..!

8. స్టాఫ్ సెలక్షన్ కమిషన్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission) కింద ఎంపిక చేసిన గ్రూప్-బీ, గ్రూప్-సీ ఆఫీసర్లకు రూ.45,000 ప్రారంభ వేతనం ఉంటుంది. కొన్ని నెలల్లోనే జీతం లక్షలకు చేరువలో ఉండే.. ఈ పోస్టులకు అభ్యర్థులను టైర్-1, టైర్-2, టైర్-3 పరీక్షలు, ఇంటర్వ్యూ తర్వాత ఎంపిక చేయడం జరుగుతుంది.

9. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఏఎస్ఓ (ASO)

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో (Ministry of External Affairs) ఏఎస్ఓగా (ASO) ఉద్యోగం పొందడానికి అభ్యర్థులు SSC CGL ఎగ్జామ్‌ను క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టుకు ఎంపికైతే వారికి వసతితోపాటు మంచి జీతం లభిస్తుంది. అలాగే దేశంలోనే పేరొందిన ఆసుపత్రుల్లో వారికి ఉచిత వైద్య సదుపాయాలు కూడా లభిస్తాయి. తొలుత వీరికి రూ.1.25 లక్షల వేతనం ఇస్తారు. తర్వాత జీతం మరింత పెరుగుతుంది.

10. ఇండియన్ ఫారిన్ సర్వీసెస్

ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ (Indian Foreign Services) పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షను నిర్వహిస్తుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. వీరికి ప్రారంభ వేతనం రూ.60,000. అయితే, కొంతకాలం తర్వాత జీతం లక్షల రూపాయలకు పెరుగుతుంది.

Updated Date - 2023-04-15T20:31:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising