ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Money: బాగా డబ్బున్న వాళ్లలో కనిపించే 10 లక్షణాలు ఇవే.. మీలో ఒక్కటైనా ఉందా?..

ABN, First Publish Date - 2023-07-10T21:32:29+05:30

డబ్బు సంపాదించడం ఒక నేర్పు. చాలామంది కష్టపడతారు కానీ అందులో కొందరు మాత్రమే సంపన్నులవుతారు. అలా సంపన్నులైనవారిలో కొన్ని ప్రత్యక్ష లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా 10 లక్షణాలను అలవాట్లుగా మార్చుకుంటారు. సంపన్నుల కావాలనే పట్టుదల ఉన్న ఎవరైనా వీటిని గమనించి అలవాటు చేసుకోవచ్చు. అవేంటో మీరూ ఒక లుక్కేయండి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డబ్బు సంపాదించడం ఒక నేర్పు. చాలామంది కష్టపడతారు కానీ అందులో కొందరు మాత్రమే సంపన్నులవుతారు. అలా సంపన్నులైనవారిలో కొన్ని ప్రత్యక్ష లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా 10 లక్షణాలను అలవాట్లుగా మార్చుకుంటారు. సంపన్నుల కావాలనే పట్టుదల ఉన్న ఎవరైనా వీటిని గమనించి అలవాటు చేసుకోవచ్చు. అవేంటో మీరూ ఒక లుక్కేయండి...

1. పొదుపు పాటిస్తారు..

సంపన్నులు విలాసవంత జీవితాన్ని ఇష్టపడతారని, తెగ ఖర్చు పెట్టేస్తారని చాలామంది అనుకుంటారు. కానీ సంపన్నులు వ్యయాల విషయంలో ఆచితూచి వ్యవహారిస్తుంటారు. వీలైనంత తక్కువ వ్యయానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. ఖర్చుల విషయంలో ప్రాధాన్యతల బట్టి డబ్బు వెచ్చిస్తుంటారు.

2. డబ్బుని వృద్ధి చేస్తూనే ఉంటారు..

ధనవంతులు ఎప్పుడూ మరింత సంపాదనపై దృష్టిసారిస్తుంటారు. ఇందుకోసం మార్గాలను అన్వేషిస్తూనే ఉంటారు. సురక్షితమైన, లాభాలకు ఎక్కువ అవకాశమున్నవాటిపై పెట్టుబడులు పెడుతుంటారు.

3. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు...

పైన చెప్పిన పాయింట్‌కు కొనసాగింపుగా సంపన్నుల్లో ఎక్కువ మంది స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లుగా ఉంటారు. తమ పెట్టుబడి వృద్ధికి స్టాక్ మార్కెట్‌లో మెరుగైన అవకాశాలు ఉండడమే ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. మంచి రిటర్నులు వస్తుండడంతో మార్కెట్లపై అడుగులేస్తుంటారు.

4. విభిన్న ఆదాయమార్గాలు...

డబ్బు సంపాదనే లక్ష్యంగా సంపన్నులు భిన్న ఆదాయమార్గాలను ఎంచుకుంటుంటారు. ఒకే కంపెనీ కింద భిన్న వ్యాపారాలే ఇందుకు చక్కటి ఉదాహరణ. ఒక కంపెనీని విస్తరించి ఆదాయ మార్గాలను పెంచుకుంటుంటారు. ఏ ఒక్క ఆదాయ వనరుకో పరిమితమవ్వరు.

5. లక్ష్యానికి తగ్గట్టు అడుగులు..

బిలియనీర్లలో అత్యధికులు భవిష్యత్‌లో తాము ఏ స్థాయిలో ఉండాలో ఆ లక్ష్యాన్ని ముందుగానే నిర్ధేశించుకుంటారు. సరైన ప్రణాళికతో టార్గెట్‌ దిశగా అడుగులు వేసుకుంటూ వెళ్తుంటారు.

6. క్రమశిక్షణ, సిరత్వం..

సంపన్నులు తమ ప్రణాళికల విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తారు. డబ్బు సంబంధ వ్యవహారాల్లో క్రమశిక్షణ, స్థిరత్వాన్ని కొనసాగిస్తుంటారు. ఈ క్రమశిక్షణ భవిష్యత్ లక్షాలను అందుకోవడంలో ఎంతో ఉపకరిస్తుంది. మెరుగైన ఫలితాన్ని త్వరగా సాధించేందుకు తోడ్పడుతుంది.

7. దీర్ఘకాల లాభాలపై దృష్టి..

సంపన్నులు దీర్ఘకాల లాభాలపై దృష్టిసారిస్తారు. స్వల్పకాలంలో నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోరు. దీర్ఘకాల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని అడుగులేస్తుంటారు.

8. రిస్క్‌కు వెనుకడుగేయరు..

రిస్క్ లేకపోతే లాభం ఉండదు.. అనే అంశాన్ని విశ్వసిస్తారు. బాగా డబ్బు సంపాదించిన వారిలో లక్షణం తప్పకుండా కనిపిస్తుంది. అవసరమైనప్పుడు నిస్సందేహంగా రిస్క్‌కు వెనుకాడకుండా ధైర్యంగా ముందుకెళ్తారు.

9. సమయాన్ని వృథా కానివ్వరు..

సమయం చాలా విలువైనది. ప్రతి నిమిషం ఎంతో విలువైనదిగా లెక్కిస్తారు. ఇంకా చెప్పాలంటే కాలాన్ని సంపాదనతో ముడివేస్తారు. క్షణం కూడా వృథా చేయకుండా కష్టపడుతుంటారు.

10. పొరపాట్ల నుంచి పాఠాలు...

బిలియనీర్లు తమ పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. అయితే తప్పు జరిగిపోయింది కదా అని అక్కడే ఆగిపోరు. ముందుకు వెళ్లే ప్రయత్నాలను విరమించుకోరు. కొత్త సవాళ్లు ఎదుర్కునేందుకు సంసిద్ధులై ముందుకు సాగుతుంటారు.

Updated Date - 2023-07-10T21:32:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising