ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

chicken biryaniలో పిల్లి మాంసం ముక్కలు..షాకైన కస్టమర్లు..!

ABN, First Publish Date - 2023-02-24T13:36:40+05:30

మీరు బిర్యానీ ప్రియులా..రుచికరమైన బిర్యానీ తక్కువ ధరకు వచ్చిందని లాగేస్తున్నారా..? అయితే..మీ గొంతులో నుంచి పిల్లి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మీరు బిర్యానీ ప్రియులా..రుచికరమైన బిర్యానీ తక్కువ ధరకు వచ్చిందని లాగేస్తున్నారా..? అయితే..మీ గొంతులో నుంచి పిల్లి కూతలు వస్తే మాత్రం..అందుకు మీరే బాద్యులు. ఎందుకంటే ఇప్పుడు కొన్నిచోట్ల పుట్ పాత్‎లపై విక్రయించే బిర్యానీలో పిల్లి మాంసాన్ని వినియోగిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో పోలీసులు(Police), ఆరోగ్య ఆహార శాఖ అధికారులు(Health Food Department officials), ఆయా దుకాణాల కోసం జల్లపడుతున్నారు. చెన్నై మహానగరం(Chennai city)లో పుట్‎పాత్(Putpath)‎లపై బిర్యానీ వ్యాపారం(Biryani business) జోరుగా నడుస్తోంది. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో వేడివేడి బిర్యానీ కోసం ఎగబడుతున్నారు.

అయితే కొన్ని దుకాణాలలో పిల్లి (CAT) మాంసంతో బిర్యానీ తయారీ చేసి విక్రయిస్తున్నట్లు జంతు సంరక్షణ అధికారులు, పోలీసులు గుర్తించారు. పైగా, బిర్యానీ కోసం సిద్ధంగా ఉంచిన 11 పిల్లులను కూడా స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నగరంలో ఉండే సంచార జాతులకు చెందిన కొందరు వ్యక్తులు ఇటీవలే పిల్లులను వేటాడి ఫుట్ పాత్ దుకాణులకు విక్రయిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో జంతు సంరక్షణ విభాగం అధికారులు పోలీసులతో ప్రత్యేక నిఘా వేశారు. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు(Madras High Court) వెనుక భాగంలో ఉన్న సంచార జాతుల వారి నుంచి 11 పిల్లులని స్వాధీనం చేసుకున్నారు. వీటిని మాంసం విక్రయించేందుకు సిద్ధం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తెలింది. దీంతో నగరంలో పలుచోట్ల ఫుట్ పాత్ దుకాణాల్లో పిల్లి మాంసం, మటన్ కలిపి బిర్యానీగా తయారు చేసి.. విక్రయిస్తున్నట్లు..తమ విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-02-24T13:46:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising