Shocking Video: షాకింగ్ వీడియో.. రోడ్డు పక్కన ఆపి ఉన్న ట్రాక్టర్‌ను చోరీ చేయాలనుకుని.. దాని టైర్ కిందే పడిపోయాడు.. చివరకు..!
ABN, First Publish Date - 2023-09-11T15:47:24+05:30
అర్ధరాత్రి రోడ్డు పక్కన పార్క్ చేసిన ఓ ట్రాక్టర్‌ను ఓ దొంగ కాజేసేందుకు ప్లాన్ వేశాడు.. వెనుక టైరు ముందు నిలబడి స్టార్ట్ చేశాడు.. స్టార్ట్ అయిన వెంటనే ట్రాక్టర్ ముందుకు కదిలింది.. దీంతో ఆ దొంగ ట్రాక్టర్ భారీ చక్రం కింద పడిపోయాడు.. అతడిపై నుంచి ట్రాక్టర్ వెళ్లిపోయింది.. అయినా ఆ దొంగ బాధపడకుండా పైకి లేచాడు..
అర్ధరాత్రి రోడ్డు పక్కన పార్క్ చేసిన ఓ ట్రాక్టర్ (Tractor)ను ఓ దొంగ (Thief) కాజేసేందుకు ప్లాన్ వేశాడు.. వెనుక టైరు ముందు నిలబడి స్టార్ట్ చేశాడు.. స్టార్ట్ అయిన వెంటనే ట్రాక్టర్ ముందుకు కదిలింది.. దీంతో ఆ దొంగ ట్రాక్టర్ భారీ చక్రం కింద పడిపోయాడు.. అతడిపై నుంచి ట్రాక్టర్ వెళ్లిపోయింది.. అయినా ఆ దొంగ బాధపడకుండా పైకి లేచాడు.. కాలి గాయంతో బాధపడుతూనే ట్రాక్టర్ ఎక్కి వెళ్లిపోయాడు.. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డు అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video)గా మారింది.
@vrajandersingh_ అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ ఘటన గుజరాత్ (Gujarat)లో జరిగింది. అర్ధరాత్రి రోడ్డు పక్కన ఓ ట్రాక్టర్ పార్కు చేసి ఉంది. దానిపై కన్నేసిన ఓ దొంగ చోరీ చేసేందుకు ప్లాన్ వేశాడు (Thief stealing tractor). సైలెంట్‍గా ఓ ట్రాక్టర్ వద్దకు వెళ్లి ఇంజిన్‌ను స్టార్ట్ చేశాడు. అయితే స్టార్ట్ అయిన ట్రాక్టర్ ముందుకు కదలడంతో పెద్ద టైరు కింద దొంగ కాలు ఇరుక్కుపోయింది. దీంతో అతను అటూ ఇటూ కదలలేని పరిస్థితి. ఆ దొంగ పై నుంటే ట్రాక్టర్ ముందుకు వెళ్లిపోయింది. అంత పెద్ద టైరు కింద నలిగిపోయిన దొంగ ఇక పైకి లేవడం కష్టం. కానీ కాసేపటికి తేరుకున్న దొంగ పైకి లేచి ట్రాక్టర్ వైపు పరిగెత్తి పైకి ఎక్కేశాడు (Shocking Video).
Viral Video: బాబోయ్.. ఇదేం ట్రక్కు.. ఇంత పొడవుందేంటి..? రెండు టైర్ల మధ్యలో కూడా ఓ డ్రైవర్..!
ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నా. ``ఆ దొంగ అదృష్టం బాగుంది``, ``ఆ దొంగ కమిట్‌మెంట్‌ను మెచ్చుకోవాల్సిందే``, ``కాలికి తగిలిన దెబ్బను కూడా అతడు పట్టించుకోలేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-09-11T15:47:24+05:30 IST