ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral News: నగల దుకాణంలో 19ఏళ్ల యువకుడు చోరీ చేసిన విధానం తెలిస్తే మతిపోవాల్సిందే..!

ABN, First Publish Date - 2023-10-22T13:34:01+05:30

అరవై నాలుగు కళల్లో చోరకళ ఒకటి. ఆ కళలో ఆరితేరిన ఓ దొంగ ఇటీవల పోలాండ్‌ (Poland) లో చాలా వినూత్నంగా చోరీకి పాల్పడ్డాడు.

Viral News: అరవై నాలుగు కళల్లో చోరకళ ఒకటి. ఆ కళలో ఆరితేరిన ఓ దొంగ ఇటీవల పోలాండ్‌ (Poland) లో చాలా వినూత్నంగా చోరీకి పాల్పడ్డాడు. అసలు ఎవరు ఊహించని విధంగా నగల షాపులో అతడు దొంగతనం చేశాడు. ఆభరణాల దుకాణంలో మనోడు చోరీ చేసిన విధానం చూసి పోలీసులే షాకయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. పోలాండ్ రాజధాని వార్సా (Warsaw) నగరంలో ఈ వినూత్న చోరీ ఘటన వెలుగు చూసింది. 19 ఏళ్ల ఓ యువకుడు మొదట స్థానికంగా ఉండే ఓ జ్యువెలరీ షాపులోకి ప్రవేశించాడు. అక్కడ ఎవరికీ తెలీకుండా నగల ప్రదర్శన కోసం పెట్టిన మెనాక్విన్‌ల మధ్య తనూ ఓ బొమ్మలా (Mannequin) నిలబడిపోయాడు. అది కూడా షాపులోని సీసీటీమీ కెమెరాలకు చిక్కకుండా చాలా చాకచక్యంగా వ్యవహరించాడు. అలా ఓ బొమ్మలా నిలబడిన అతడు షాపు మూసేవరకు ఎదురుచూశాడు. కొంచెం కూడా కదలకపోవడంతో షాపులోని కస్టమర్లు గానీ, సెక్యూరిటీ సిబ్బందీ గానీ ఎవరూ ఆ యువకుడిని గుర్తించలేకపోయారు. ఇక దుకాణం ముసేసిన తర్వాత అందులోని విలువైన ఆభరణాలు దొంగిలించి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు.

Crime: పోలీసుల ముందు నిల్చున్న ఇతడు అమాయకంగా కనిపిస్తున్నాడు కానీ.. అతడి ఇంట్లో వెతికితే ఏం బయటపడ్డాయో తెలిస్తే..!

ఎలా దొరికాడంటే..

నగల షాపు మూసేశాక యువకుడు తీరిగ్గా తనకు కావాల్సిన నగలు దొంగలించాడు (Robbery). అక్కడి నుంచి బయటపడిన తర్వాత ఓ రెస్టారెంట్‌‌కు వెళ్లి భోజనం చేశాడు. అనంతరం మరో బట్టల దుకాణంలో చోరబడ్డాడు. అక్కడ తనకు నచ్చిన దుస్తులు బ్యాగులో వేసుకున్నాడు. అలా బట్టల షాపులో దొంగతనం చేసుకుని బయటకు వచ్చే క్రమంలో అక్కడి సెక్యూరిటీ సిబ్బంది చేతికి చిక్కాడు. దాంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వారి ఫిర్యాదు మేరకు యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైనశైలిలో విచారించడంతో మనోడి డొంక మొత్తం కదిలింది. ఆ సమయంలోనే పోలీసులకు ఆ యువకుడు తాను ఆభరణాల దుకాణంలో దొంగతనం గురించి చెప్పాడు. అది తెలిసి పోలీసులకు కొద్దిసేపు నోటమాట రాలేదట. ఇప్పుడీ చోరీ ఘటన బయటకు రావడంతో మనోడి చోరళకు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Viral News: ప్లీజ్ అంటూ వేడుకున్న కస్టమర్.. చెత్త డబ్బాలోంచి ఆ రెస్టారెంట్ ఓనర్ ఏం తీసి ఇచ్చారంటే..!

Updated Date - 2023-10-22T13:34:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising