ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Lion: పాపం.. ఆ సింహం ఎంత దాహంతో ఉందో.. వాటర్ బాటిల్ చూడగానే చిన్న పిల్లలా ఎలా పరిగెత్తుకుంటూ వచ్చిందో చూడండి..

ABN, First Publish Date - 2023-07-01T12:27:48+05:30

జంతువులకు సంబంధించిన అనేక ఆసక్తికర, దిగ్భ్రాంతికర వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. ముఖ్యంగా వన్య ప్రాణులు అనుభవిస్తున్న సమస్యలను అవి కళ్లకు కడుతున్నాయి. ఆహారం లేక, నీళ్లు లేక, ఆవాసం లేక అవి మానవుల స్వార్థానికి ఎలా బలవుతున్నాయో తరచుగా చూస్తూనే ఉన్నాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంతువులకు సంబంధించిన అనేక ఆసక్తికర, దిగ్భ్రాంతికర వీడియోలు (Wild Animal videos) ప్రతిరోజూ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. ముఖ్యంగా వన్య ప్రాణులు అనుభవిస్తున్న సమస్యలను అవి కళ్లకు కడుతున్నాయి. ఆహారం లేక, నీళ్లు లేక, ఆవాసం లేక అవి మానవుల స్వార్థానికి ఎలా బలవుతున్నాయో తరచుగా చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ సింహం (Lion) మంచి నీటి (Water) కోసం కటకటలాడింది. ఇప్పటి వరకు పెంపుడు జంతువులు, ఉడుత లేదా పక్షి బాటిల్ నుంచి నీరు తాగడం చూసి ఉంటారు.

మొదటి సారి మృగరాజు ఓ వాటర్ బాటిల్ నీళ్ల కోసం పరితపించడం చూస్తుంటే మాత్రం చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు (Lion drinks water from bottle). IFS అధికారి సుశాంత నంద ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి చేతిలో వాటర్ బాటిల్‌తో నిల్చున్నాడు. అప్పుడు ఒక సింహం పొద వెనుక నుండి పరుగెత్తుకుంటూ ఆ వ్యక్తి దగ్గరికి వచ్చింది. అతడి చేతిలో ఉన్న వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగడం ప్రారంభించింది (Lion videos).

Viral Video: ఆమె ట్యాలెంట్ అద్భుతం.. చీర కట్టుకుని ఎలాంటి స్టంట్స్ చేసిందో చూడండి..

సింహం నీళ్లు తాగుతున్న తీరు చూస్తుంటే దానికి విపరీతంగా దాహం వేస్తోందని, గొంతు ఎండిపోయిందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 46 వేల మందికి పైగా వీక్షించారు. నీటి విలువను అందరూ అర్థం చేసుకుని మసులు కోవాలని కొందరు కామెంట్లు చేశారు. ``పాపం.. సింహం ఎప్పట్నుంచి దాహంతో ఉందో`` అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-07-01T12:27:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising