Viral News: ఎవరీ వ్యక్తి..? రోడ్డు పక్కన డోలు వాయిస్తున్న ఇతడి ఫొటో సడన్‌గా తెగ వైరల్ అవడం వెనుక..!
ABN, First Publish Date - 2023-09-26T16:17:35+05:30
ప్రపంచం మొత్తం డిజిటలైజేషన్ వైపు దూసుకెళ్తోంది. గ్రామాల్లోని కిరాణా దుకాణాలు, కూరగాయలు అమ్మేవాళ్లు దగ్గర్నుంచి అందరూ యూపీఐ చెల్లింపును అంగీకరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టెక్ నగరమైన బెంగళూరు నగరం మరో అడుగు ముందుకేసింది.
ప్రపంచం మొత్తం డిజిటలైజేషన్ (Digitalization) వైపు దూసుకెళ్తోంది. గ్రామాల్లోని కిరాణా దుకాణాలు, కూరగాయలు అమ్మేవాళ్లు దగ్గర్నుంచి అందరూ యూపీఐ చెల్లింపును (UPI Payments) అంగీకరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టెక్ నగరమైన బెంగళూరు (Bengaluru) నగరం మరో అడుగు ముందుకేసింది. బెంగళూరులో చాలా మంది యూపీఐ ద్వారానే చెల్లింపును స్వీకరిస్తున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ డ్రమ్మర్ (Bengaluru drummer) కూడా అదే తరహాలో సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంటున్నాడు.
Prateek bhatnagar అనే ట్విటర్ యూజర్ ఆ ఫొటోను షేర్ చేశారు. ఆ ఫొటోలో ఓ ఢోలక్‌వాలా కూడా కనిపిస్తున్నాడు. అతను తన మొబైల్ ఫోన్‌లో యూపీఐ QR కోడ్‌ను తెరిచి ఉంచి ధోలక్ పైన ఉంచాడు. డిజిటల్ పేమెంట్ చేయాలనుకునే వారి కోసం ఆ డ్రమ్మర్ ఈ ఏర్పాటు చేశాడు. ఈ ఫోటోను షేర్ చేసిన వ్యక్తి ``పీక్ బెంగళూరు`` మూమెంట్ అని కామెంట్ చేశాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది ఈ ఫొటోను లైక్ చేస్తున్నారు.
Viral News: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ఉద్యోగి.. 3 గంటల తర్వాత బయటపడి ఆఫీసుకెళ్తే.. హెచ్ఆర్ మాటలు విని అతడికి షాక్..!
అతను ఫోన్ కాకుండా క్యూఆర్ కోడ్ ప్రింటవుట్ తీసి అంటిస్తే బాగుండేదని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. బెంగళూరు నుంచి ఇలాంటి ఫొటోలు చాలా బయటకు వస్తున్నాయి. బెంగళూరులోని గతంలో ఓ ఆటో డ్రైవర్ తన స్మార్ట్ వాచ్ స్క్రీన్ సేవర్‌గా క్యూఆర్ కోడ్‌ను సేవ్ చేశాడు.
Updated Date - 2023-09-26T16:17:35+05:30 IST