Viral News: 28 అకౌంట్లను ఓపెన్ చేసి.. ఏకంగా రూ.2 కోట్లు కొట్టేశాడు.. అసలేం చేశాడో తెలిసి అవాక్కైన బ్యాంకు సిబ్బంది..!
ABN, First Publish Date - 2023-10-30T18:54:49+05:30
బ్యాంకులను తప్పు దోవ పట్టించి కొందరు దుండగులు రకరకాల స్కామ్‌లు చేస్తుంటారు. పోలీసులు, బ్యాంకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దుండగులు కొత్త కొత్త మార్గాలను కనిపెడుతూనే ఉంటారు. తాజాగా గురుగ్రామ్‌లోని ఓ బ్యాంకును ఓ వ్యక్తి నమ్మించి ఏకంగా రూ.2 కోట్లు కొట్టేశాడు.
బ్యాంకులను (Banks) తప్పు దోవ పట్టించి కొందరు దుండగులు రకరకాల స్కామ్‌లు చేస్తుంటారు. పోలీసులు, బ్యాంకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దుండగులు కొత్త కొత్త మార్గాలను కనిపెడుతూనే ఉంటారు. తాజాగా గురుగ్రామ్ (Gurugram)లోని ఓ బ్యాంకును ఓ వ్యక్తి నమ్మించి ఏకంగా రూ.2 కోట్లు కొట్టేశాడు. ఆ స్కామ్ (Bank Scam)బయటడడంతో చాలా మంది నివ్వెరపోయారు. సామ్‌సంగ్ కంపెనీ హెచ్‌ఆర్ హెడ్‌గా నటిస్తూ, ఆ వ్యక్తి హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు (HSBC Bank)ను మోసం చేశాడు. కేవలం ఏడు నెలల్లోనే ఇంత పెద్ద మొత్తంలో డబ్బును కొట్టేశాడు.
సామ్‌సంగ్ (Samsung) ఇండియా హెచ్‌ఆర్ హెడ్‌గా నటిస్తూ సచిన్ కతురియా అనే వ్యక్తి హెచ్‌ఎస్‌బిసి బ్యాంక్ సిబ్బందిని కలిశాడు. శాంసంగ్ కంపెనీలో ఉద్యోగులుగా పేర్కొంటూ 28 మంది పేర్లతో హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో శాలరీ అకౌంట్స్ (Salary Accounts) ఓపెన్ చేశాడు. ప్రతినెలా శాంసంగ్ శాలరీ పేమెంట్ పేరుతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జీతం రూపంలో హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులోని ఆ ఖాతాలకు నగదు బదిలీ చేసేవాడు. మూడు నెలల అనంతరం ఆ శాలరీ అకౌంట్లను చూపించి 28 క్రెడిట్ కార్డులు తీసుకున్నాడు. అలాగే మూడు అకౌంట్ల నుంచి భారీ మొత్తంలో లోన్లు తీసుకున్నాడు. ఇలా డిసెంబర్ 2022 నుంచి జూన్ 2023 మధ్య రూ.2 కోట్లకు పైనే బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నాడు.
Wife-Husband: భార్య దగ్గర సీక్రెట్ ఫోన్.. చాటుగా ఎవరితో మాట్లాడుతోందో తెలిసి భర్తకు షాక్.. చివరకు ఊహించని సీన్..!
క్రెడిట్ కార్డుల ద్వారా తీసుకున్న రుణాలను, బ్యాంక్ లోన్లను సచిన్ తిరిగి కట్టలేదు. దీంతో బ్యాంకు అధికారులు ఆయా ఖాతాదారులను సంప్రదించారు. వారు తమకేం తెలియదని, తాము శాంసంగ్ ఉద్యోగులం కాదని, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో తమకు అకౌంట్లు లేవని స్పష్టం చేశారు. దీంతో బ్యాంకు అధికారులకు అసలు విషయం అర్థమైంది. ప్రాథమిక దర్యాప్తు తర్వాత బ్యాంకు అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Updated Date - 2023-10-30T18:54:49+05:30 IST