worlds largest turtle: ఆ జీవి తనకు హాని కలుగుతుందని గుర్తించగానే తన ఆకారాన్ని రెండింతలు పెంచేస్తుంది... 2 టన్నుల బరువుండే ఆ జీవి ఇప్పుడెలా ఉన్నదంటే...
ABN, First Publish Date - 2023-03-18T07:09:53+05:30
worlds largest turtle: ఈ రోజు మనం ప్రపంచం(world)లోనే అతిపెద్ద తాబేలు గురించి తెలుసుకోబోతున్నాం. దాని పొడవు, వెడల్పు ఎంత ఉంటుందో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. డైనోసార్ యుగానికి చెందిన ఈ తాబేలు...
worlds largest turtle: ఈ రోజు మనం ప్రపంచం(world)లోనే అతిపెద్ద తాబేలు గురించి తెలుసుకోబోతున్నాం. దాని పొడవు, వెడల్పు ఎంత ఉంటుందో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. డైనోసార్ యుగానికి చెందిన ఈ తాబేలు(turtle) అత్యధిక పొడవు కలిగి ఉండటమే కాకుండా బరువులోనూ భారీగా ఉంటుండి. ఈ తాబేలు బరువు దాదాపు 2 టన్నులు(2 tons) ఉంటుందని శాస్త్రవేత్తలు(Scientists) అంచనా వేస్తున్నారు.
ఐరోపాలో ఇప్పటి వరకు దొరికిన తాబేళ్లన్నింటిలో ఇదే పెద్దదని చెబుతున్నారు. ఈ తాబేలు సజీవంగా(alive) లభ్యంకానప్పటికీ, శిలాజంగా కనుగొన్నారు. ఐరోపా(Europe)లో ఇప్పటివరకు కనుగొన్న అన్ని తాబేళ్లలో ఇది అతిపెద్దదని దాని అవశేషాలు తెలియజేస్తున్నారు. ఇది 83 మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపైనే ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని పొడవు దాదాపు 12 అడుగులు. అంటే సగటు వ్యక్తి ఎత్తు కంటే రెట్టింపు ఎత్తు ఉంటుంది.
ప్రస్తుతం(Currently) భూమిపై సజీవంగా ఉన్న అతిపెద్ద తాబేళ్లు లెదర్‌బ్యాక్ తాబేళ్లు. వాటి పొడవు 7 అడుగుల వరకు ఉంటుంది. అయితే భూమిపై ఇప్పటివరకు కనుగొన్న అతిపెద్ద తాబేళ్ల విషయానికి వస్తే ఆర్కెలాన్(Archelon) పేరు ముందుగా వినిపిస్తుంది. దీని పొడవు సుమారు 15 అడుగులు. ఈ భూమిపై డైనోసార్(Dinosaur)లు ఉన్నప్పుడు, మొజాసారస్ అనే తాబేలు జాతి ఉండేదని, దీని పొడవు సుమారు 50 అడుగుల వరకు ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతారు.
బార్సిలోనా విశ్వవిద్యాలయంలో పాలియోంటాలజీ పరిశోధకులు(Researchers) ఆస్కార్ కాస్టిల్లో మాట్లాడుతూ, డైనోసార్‌లు ఈ భూమిపై నివసించినప్పుడు ఈ తాబేళ్ల పరిమాణం(size) చాలా పెద్దదిగా ఉండేంది. ఈ తాబేళ్లు తమ చుట్టూ ఉన్న మాంసాహార జీవుల(Carnivorous organisms) నుండి తప్పించుకోవడానికి తమ శరీర పరిమాణాన్ని పెంచుకునేవని తెలిపారు. ఇదేవిధంగా నేటికీ కొన్ని జీవులు తమ ఆకృతిలో ఇలాంటి మార్పులు(Changes) చేసుకుంటాయన్నారు.
Updated Date - 2023-03-18T07:52:47+05:30 IST