ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదృష్టమంటే ఇదే.. అనాథగా బ్రతుకుతున్న ఈ పిల్లాడి జీవితం ఒక్కసారిగా మారిపోయింది..

ABN, First Publish Date - 2023-01-08T17:23:54+05:30

రేపటి రోజున వారి జీవితాలు ఎలా ఉంటాయోనని అనుకున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వయసు చూస్తే రెండేళ్ళు, అనాథశరణాలయంలో వారు పెట్టింది తింటూ ఏమీ తెలియని అమాయకత్వంలో రేపు గురించి కనీసం ఆలోచన కూడా లేకుండా ఉంటున్నాడు ఆ పిల్లాడు. అనాథశరణాలయం వారు మాత్రం ఆ పిల్లాడి గురించి మాత్రమే కాదు అక్కడ ఉంటున్న ఎంతో మంది పిల్లల గురించి బెంగపడేవారు. రేపటి రోజున వారి జీవితాలు ఎలా ఉంటాయోనని. కానీ రెండేళ్ల ధర్మరాజు జీవితం ఒక్కసారిగా మారిపోయింది. అనాథశరణాలయం నుండి అబ్రాడ్ వైపుకు ఈ పిల్లాడి అడుగులు పడుతున్నాయి. ఇంతకూ జరిగిన విషయం ఏమిటంటే...

బీహార్ రాష్ట్రంలో బెగుసరాయ్ అనే అనాథాశ్రమం ఉంది. అక్కడ ఎంతో మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళలో ధర్మరాజు అనే రెండేళ్ల పిల్లాడు కూడా ఉన్నాడు. ఆ పిల్లాడి కోసం స్వీడన్ నుండి వచ్చిందొక జంట. వారు ధర్మరాజును దత్తత తీసుకున్నట్టు తెలిసింది. కొత్త సంవత్సరంలో పిల్లాడికి కొత్త ఫ్యామిలీ ఏర్పడుతున్నందుకు అనాథాశ్రమ సిబ్బంది చాలా సంతోషంగా ఉంది. అలాగే పిల్లాడిని దత్తత తీసుకున్నదుకు స్వీడన్ నుండి వచ్చిన సంజయ్ డానియేల్, కత్రినా సంజయ్ అనే జంట కూడా చెప్పలేనంత సంతోషంగా ఉన్నారు. స్వీడన్ లో నివాసం ఉంటున్న సంజయ్ బిజినెస్ మెన్ కాగా అతని భార్య కత్రినా లైబ్రేరియన్ గా పనిచేస్తోందట.

దత్తతకు సంబంధించిన వివరాల గురించి అనాథాశ్రమ ఇంచార్జ్ శృతి కుమారి మాట్లాడుతూ 'ప్రస్తుతం దత్తతకు సంబంధించి రిజిస్ట్రేషన్ మొత్తం ఆన్ లైన్ లో ఎంతో సులువుగా జరిగిపోతోంది. దీని వల్ల దత్తత అనేది కష్టతరంగా లేదు. పిల్లలను దత్తత తీసుకునేందుకు అర్హులెవరైనా సరే ప్రభుత్వం కల్పిస్తున్న సులువైన మార్గంలో దత్తత తీసుకోవచ్చు' అని పేర్కొన్నారు. ప్రక్రియ మొత్తం ఆన్లైన్ లో పూర్తి కాగా పిల్లాడిని తీసుకెళ్ళడానికి స్వీడన్ నుండి సంజయ్ దంపతులు వచ్చారట. జిల్లా కలెక్టరాఫీసు వద్ద రెండేళ్ళ ధర్మరాజును స్వీడన్ దంపతులు దత్తత తీసుకున్నారు. దత్తత ఇవ్వగానే తమ బాధ్యత తీరిపోదని పిల్లల గురించి ఎప్పటికప్పుడు క్షేమసమాచారాలు తెలుసుకుంటూ ఉంటామనివారు తెలిపారు. కాగా ధర్మరాజుతో పాటు మరో ఇద్దరు పిల్లలను కూడా ఈ కొత్త సంవత్సరంలో దత్తత తీసుకున్నారట. వారిలో ఒక ఆంధ్రా జంట కూడా ఉన్నారని తెలిపారు. ఏది ఏమైనా భవిష్యత్తు ఏంటో అనే అయోమయంలో ఉన్న అనాథ పిల్లలను దత్తత తీసుకోవడం వారికి కొత్త జీవితాన్ని ఇవ్వడం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం.

Updated Date - 2023-01-08T17:27:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising