Viral Video: ఏం లాజిక్కు మాస్టారూ?.. 2+2=5 అని నిరూపించారు.. ప్రతీ స్కూల్లో ఇలాంటి టీచర్ ఉంటే.. లెక్కలంటే భయపడేవారే ఉండరు..!
ABN, First Publish Date - 2023-06-09T15:08:45+05:30
రెండుకు రెండు కలిపితే ఎంత అని అడిగితే.. వెంటనే ఎవరైనా నాలుగు అని సమాధానం చెప్పేస్తారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే మాత్రం కాస్త ఆలోచనలో పడాల్సిందే. ఎందుకంటే ఆ వీడియోలో ఓ వ్యక్తి చెబుతున్న దాని ప్రకారం రెండుకు రెండు కలిపితే ఐదు అవుతోంది. ఆ వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.
రెండుకు రెండు కలిపితే ఎంత అని అడిగితే.. వెంటనే ఎవరైనా నాలుగు అని సమాధానం చెప్పేస్తారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చూస్తే మాత్రం కాస్త ఆలోచనలో పడాల్సిందే. ఎందుకంటే ఆ వీడియోలో ఓ వ్యక్తి చెబుతున్న దాని ప్రకారం రెండుకు రెండు కలిపితే ఐదు అవుతోంది. ఆ వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఆ వీడియోలో టీచర్ (Maths Teacher) ఒక ఫార్ములాను ఉపయోగించి 2+2=5 అని నిరూపించాడు. వీడియో చూసిన తర్వాత ఎవరైనా ఒక నిమిషం ఆలోచనలో మునిగిపోవాల్సిందే.
VIDEO NATION అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోలో ఓ లెక్కల టీచర్ 2+2=5 అని నిరూపించాడు. గణితంలో ఉపయోగించే ఓ ఫార్ములాను వర్తింపజేస్తూ బోర్డుపై ఓ లెక్క చేశాడు. మొదట ఆ టచర్ బోర్డుపై 0=0 అని వ్రాసి, రకరకాల ఫార్ములాలు ఉపయోగించి చివరికి 2+2=5 అవుతుందని రుజువు చేశాడు. ఈ వీడియో చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
Viral Video: వైరల్గా మారిన షాకింగ్ వీడియో.. ఓ యువతిని ఎత్తుకుని మరీ అగ్ని ప్రదక్షిణలు.. ఆమె ఏడుస్తూ వద్దని వేడుకుంటున్నా..!
దాదాపు 2.5 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ ఫార్ములా ఉపయోగించి నమ్మశక్యం కాని ఫలితాలను రాబట్టవచ్చని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ``సోదరా.. మీ జ్ఞానం అద్భుతం`` అని ఒకరు కొనియాడరు. మరికొందరు ఆ లెక్కల మాస్టారి తర్కంపై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-06-09T15:08:45+05:30 IST