Crime: ఒకే ఒక్క కుక్క.. ముగ్గురి ప్రాణాలను తీసింది.. ఇదేమీ రివేంజ్ స్టోరీ కాదండోయ్.. అసలేం జరిగిందంటే..!
ABN, First Publish Date - 2023-07-24T19:54:44+05:30
ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌లో జరిగిన ఓ ఘటన చాలా మందికి షాక్ కలిగిస్తోంది. రామ్‌పూర్‌కు చెందిన ముగ్గురు యువకులు ఒక కుక్క వల్ల ప్రాణాలు కోల్పోయారు.. అలాగని ఆ కుక్క వారిని వెంటాడి చంపలేదు.. ఆ కుక్కను కాపాడే క్రమంలో ఆ ముగ్గురూ మరణించారు.. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని రామ్‌పూర్‌లో జరిగిన ఓ ఘటన చాలా మందికి షాక్ కలిగిస్తోంది. రామ్‌పూర్‌కు చెందిన ముగ్గురు యువకులు ఒక కుక్క (Dog) వల్ల ప్రాణాలు కోల్పోయారు.. అలాగని ఆ కుక్క వారిని వెంటాడి చంపలేదు.. ఆ కుక్కను కాపాడే క్రమంలో ఆ ముగ్గురూ మరణించారు.. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు (Crime News).
రామ్‌పూర్‌లోని గంజ్ కొత్వాలికి చెందిన జీషన్ అనే కుర్రాడు నగరంలోని గ్రీన్‌వుడ్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో 11వ తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం జీషన్ తన స్నేహితులు అహద్, ఉమైర్‌లను తన స్కూటీ (Scooty)పై ఎక్కించుకుని స్కూల్‌కు వెళ్తున్నాడు. నైనిటాల్ రోడ్డులోని హోండా ఏజెన్సీ ఎదురుగా వారు వేగంగా వెళ్తుండగా ఓ కుక్క ఎదురు వచ్చింది. ఆ కుక్కను తప్పించే క్రమంలో జీషన్ స్కూటీ హ్యాండిల్‌ను పక్కకు తిప్పాడు. దీంతో స్కూటీ నేరుగా వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టింది (Road Accident).
Boys Hostel Room: బ్యాచులర్స్ గదిలోంచి బయటకు వచ్చిన ఒక్క ఫొటో.. సోషల్ మీడియా షేక్ అయిపోతోందిగా..!
ఆ ప్రమాదంలో యువకులు ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర రక్తస్రావం కావడం వల్ల హాస్పిటల్‌కు తీసుకెళ్లే సమయానికే ముగ్గురూ మరణించినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. ఓ చిన్న ప్రమాదంలో ముగ్గురూ ప్రాణాలు కోల్పోవడం చాలా మందికి షాక్ కలిగిస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
Updated Date - 2023-07-24T19:54:44+05:30 IST