Shocking: శ్రీకాంత్ సినిమా కథ.. అక్కడ నిజంగానే జరిగిందిగా.. పోలీసుల వల్లే ఓ వ్యక్తి చనిపోయినా.. శవాన్ని రోడ్డు పక్కన పడేసి..!
ABN, First Publish Date - 2023-10-19T11:35:05+05:30
'నాయట్టు' అనే మలయాళ సినిమాను తెలుగులో శ్రీకాంత్ లీడ్ రోల్‌లో 'కోట బొమ్మాళి' అనే పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అచ్చం ఈ సినిమా కథను పోలిన ఘటన ఒకటి తాజాగా రాజస్థాన్‌లో జరిగింది.
'నాయట్టు' అనే మలయాళ సినిమాను తెలుగులో శ్రీకాంత్ లీడ్ రోల్‌లో 'కోట బొమ్మాళి' అనే పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అచ్చం ఈ సినిమా కథను పోలిన ఘటన ఒకటి తాజాగా రాజస్థాన్‌లో జరిగింది. ఇంతకీ ఈ సినిమా కథ ఏంటంటే.. పోలీసులు అనుకోకుండా తమ జీపుతో ఢీకొట్టి ఓ వ్యక్తిని చంపేస్తారు. అనంతరం అతడి శవాన్ని పక్కనే ఉన్న చెట్ల పొదలలో పడేసి పారిపోవాలని చూస్తారు. కానీ, అక్కడి స్థానికులు వారిని గుర్తించి వెంబడించి పట్టుకుంటారు. ఇదిగో రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో కూడా అచ్చం ఇలాగే జరిగింది. తప్పతాగి వాహనం నడుపుతూ ఓ యువకుడిని చంపేసిన పోలీసులు, అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ, స్థానికులు వారిని గుర్తించి పట్టుకున్నారు. ఇప్పుడు ఈ ఘటన జైసల్మీర్‌లో కలకలం రేపుతోంది. కాగా, ఈ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తికి నాలుగు నెలల క్రితమే పెళ్లి కావడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
అసలేం జరిగిందంటే..
జైసల్మీర్‌లోని ఖుహ్ది పోలీస్ స్టేషన్ పరిధిలోని ధోబా అనే గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామానికి చెందిన పృథ్వీ సింగ్ మంగళవారం రాత్రి తన పోలంలో నీరు వదలడానికి వెళ్లాడు. అక్కడ పని ముగించుకుని బైక్‌పై తిరిగి ఇంటికి బయల్దేరాడు. అదే సమయంలో వాటర్ సప్లై డిపార్ట్‌మెంట్‌కు చెందిన వాహనం అటువైపుగా వచ్చింది. అందులో ముగ్గురు పోలీసులతో పాటు వాటర్ సప్లై విభాగానికి చెందిన ఉద్యోగులు ఉన్నారు. వాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు అందులోని పోలీసులు, ఇతర ఉద్యోగులు కూడా పూటుగా మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న జీపు డ్రైవర్ ముందు వెళ్తున్న పృథ్వీ సింగ్ బైక్‌ను ఢీకొట్టాడు. దాంతో అతడు స్పాట్‌లోనే చనిపోయాడు.
Shocking: ఏడుస్తూ ఇంటికొచ్చిన 7 ఏళ్ల కూతురు.. ఏమైందమ్మా అని ఒడిలో కూర్చోబెట్టుకుని అడిగితే.. ఆ పాప చెప్పింది విన్న తల్లికి..!
వెంటనే వాహనం నుంచి కిందకు దిగిన పోలీసులు, ఉద్యోగులు పృథ్వీ చనిపోవడం గుర్తించి మృతదేహాన్ని రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదలలో పడేసి పారిపోవాలని చూశారు. కానీ, అప్పటికే స్థానికులు వారిని చూసేశారు. ప్రమాదం జరిగి ఓ వ్యక్తి చనిపోయాడని తెలియడంతో గ్రామస్థులు అలెర్ట్ అయ్యారు. వెంటనే ప్రమాదస్థలికి చేరుకుని, చనిపోయింది తమ గ్రామస్థుడు పృథ్వీ సింగ్ అని గుర్తించారు. పారిపోతున్న పోలీసులు, ఉద్యోగులను వెంబడించి పట్టుకున్నారు. ఆ తర్వాత వారిని పోలీసులకు అప్పగించారు.
కాగా, పోలీసుల విచారణలో ఖుహ్ది పోలీస్ స్టేషన్‌లో పనిచేసే ఓ వ్యక్తి మందు పార్టీ ఇవ్వడం.. అందులో జీవరామ్, శంభురామ్, చైనారాం అనే పోలీస్ సిబ్బంది పాల్గొన్నట్లు తేలింది. పార్టీలో పూటుగా మద్యం సేవించిన ఆ ముగ్గురు, వాటర్ సప్లై విభాగానికి చెందిన వాహనంలో తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో ఇలా యాక్సిడెంట్ చేసినట్లు నిర్ధారణ అయింది. ముగ్గురు పోలీస్ సిబ్బందిని ఎస్పీ సస్పెండ్ చేశారు. ఈ ఘటనతో ధోబా గ్రామంలో విషాదం అలుముకుంది. వివాహమై నాలుగు నెలలు కూడా గడవకుండానే భర్తను కోల్పోయిన పృథ్వీ సింగ్ భార్య గుండెలవిసెలా రోదిస్తోంది.
Crime: పోలీసుల ముందు నిల్చున్న ఇతడు అమాయకంగా కనిపిస్తున్నాడు కానీ.. అతడి ఇంట్లో వెతికితే ఏం బయటపడ్డాయో తెలిస్తే..!
Updated Date - 2023-10-19T11:40:03+05:30 IST